వెన్నెల ఊసులు ;-- ఎం. వి. ఉమాదేవి
 తేటగీతి మాలిక 
మగువ నిశ్చల భావాలు మదిని నిలిపి 
తనను తానెట్లు మరచిన తపసియయ్యె 
తరుణి వెన్నెల యూసులు తనకుతాను 
జెప్పు కొనుచుండ జలధియె చెవులనొగ్గి 
యలల తోడను నూకొట్టు చున్నదేమొ 
శాంత మేకాంత తీరమ్ము సంతసముగ 
జీవ సాఫల్య మేమంటు చింతపడక
లోక సహజమున్  యోచించ లోతుగాను
భావ మేఘాల లేనట్టి భవ్యరీతి 
మనసు స్వచ్ఛమై భాసిల్లె మందిరముగ!!

కామెంట్‌లు