అనంతం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆధనవంతునికి ఒక్క డే కొడుకు. పేరు రాజా!తల్లి లేని పిల్లాడని ముద్దు గా పెంచితే  వాడు శుంఠగా మారాడు.మొక్కై వంగనిది మానై వంగుతుందా? అవకాశ వాదులైన స్నేహితులు జల్సారాయుళ్లు! దిగులు తో  తండ్రి కి హఠాత్తుగా గుండె పోటు వచ్చింది. "రాజా!నేనింక ఎక్కువ కాలం బతకను.ఇన్నాళ్ళు మారుతావని చూశాను. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏంలాభం?బాల్యంలో బద్దకంతో లేచేవాడివి కాదు.పొట్టనిండా మెక్కి మంచమెక్కేవాడివి.నేను చనిపోయాక దిక్కు దివాణంలేనివాడివి అవుతావు.మరీకష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటావేమో? ఆతప్పు పని చేయకు.మళ్ళీ వచ్చే జన్మలో నికృష్టంగా పుడతావు.బతికి సాధించాలి. ఆమూల సామాన్లగది తెరు.నీకు పరిష్కారం లభిస్తుంది."తండ్రి కన్నుమూశాడు.కొన్నాళ్ళు  దిగులుగా గడిపాడు.కానీ దుష్ట స్నేహితుల సాంగత్యంలో ఉన్న దంతా ఊడ్చిపెట్టుకు పోయింది. ఆదొంగ మిత్రులు రాజా బికారి కావటంతో తప్పుకున్నారు.చేత చిల్లిగవ్వ లేదు. ఆకలి దంచేస్తుంటే  అందరినీ అడిగి బైటకి గెంటివేయబడ్డాడు.వాడికి జీవితం అంటే విసుగు నిరాశ!హఠాత్తుగా తండ్రి మాటలు గుర్తు కొచ్చాయి.చీకటి సామాన్లగది తెరిచాడు. అక్కడ ఓఉరిత్రాడు వ్రేలాడుతోంది.ఆతాడుని మెడకి తగుల్చుకుందామని దగ్గరకు వెళ్లాడు.పెద్ద అక్షరాలున్న అట్ట వేలాడుతోంది."నీవు  ఈతాడు గట్టిగా ఉందో లేదో చూడు.మధ్యలో అది పుటుక్కున తెగితే అటు చావు ఇటు బతుకు కాని త్రిశంకు స్వర్గం లో వేలాడ్తావు."రాజా  ఒక్క సారి గా గట్టిగా ఆ తాడుని గుంజాడు.పైకప్పు ఒక్క సారి గా పెచ్చులు పెచ్చులుగా ఊడి కింద పడింది. దానితో పాటే  బంగారు నాణాలున్న మూట ధనాధన్ శబ్దంతో నేలపై బడింది.రాజా కళ్ళు  ఆశ్చర్యంగా విచ్చుకున్నాయి. ఆమూటని జాగ్రత్తగా దాచి కొన్ని నాణాలతో తిండితిప్పలుతో  బలం పుంజుకున్నాడు.ఓదర్జీ దగ్గర నేర్చుకున్న పనితో రాజాకి చేతినిండా పని.మగ్గంవర్క్ తో బాగా సంపాదిస్తున్నాడు.దర్జీకి పిల్లలు లేరు.రాజాకూడా అతన్ని తండ్రిలా  ఆదరంగా ప్రేమగా  చూస్తున్నాడు. పెళ్లి చేసుకున్న రాజా సుఖంగా జీవనం సాగిస్తున్నాడు.తండ్రి చెప్పిన  మాట గుర్తు చేసుకుంటాడు"కష్టేఫలీ! జీవితం  అంతం కాదు.ఎప్పుడూ ఆరంభం  నూతనం సుమా🌹
కామెంట్‌లు