చిలిపి కృష్ణయ్య ;-ఎం. వి. ఉమాదేవి
ఆట వెలదులు 

తామరాకు నందు దరహాస మొలికించు 
చిలిపి కృష్ణ నేడు చింతదీర్చె 
వింతనవ్వుచూడు మిoతిoత కనులమ్మ 
గోపబాలలెల్ల గోలమానె !

మురళిదట్టి దోపి ముచ్చటన్ పవళించ
మూడులోకములును మురిసి చూసె 
నటన సూత్ర ధారి నయగారమొలికించ
యశము పొందినారు యాదవులును !!


కామెంట్‌లు