ఆశీస్సులు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అందమైన గుర్రమెక్కి 
ఆ రాజ్యం పోతా 
కోటలోని రాజు గారి 
కడకు వెళ్ళి వస్తా 
అందమైన యువరాణి 
వద్దకు నే పోతా 
కోటలోని రాజు గారి 
అల్లుడినై వస్తా 
వీరుడినని శూరుడినని 
నిరూపించు కుంటా 
రాజు గారి ఆశీస్సులు 
నేను అందుకుంటా !!

కామెంట్‌లు