బలవర్ధకం(బాల గేయం)-గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి.,
పాలమ్మ పాలు 
తెల్ల తెల్లని పాలు
 ఆవులు ఇచ్చే పాలు 
ఆరోగ్యం ఇచ్చే పాలు

 పాలమ్మ పాలు
 గేదెలు ఇచ్చే పాలు
 ఆకలి తీర్చే పాలు 
బలాన్ని ఇచ్చే పాలు

 పాలమ్మ పాలు
 మేకలు ఇచ్చే పాలు
 మేలైన  పాలు
 ఔషధాలున్న పాలు

  పాలమ్మ పాలు
  అమ్మ ఇచ్చే పాలు 
అమృతాల పాలు
 బొజ్జ నింపే పాలు

 పాలమ్మ పాలు
 జున్ను నిచ్చే పాలు
వెన్న నిచ్చే పాలు
నెయ్యి నిచ్చే పాలు

 పాలమ్మ పాలు
పెరుగు నిచ్చే పాలు
 మజ్జిగ నిచ్చే పాలు
 నిద్ర బుచ్చే పాలు

 పాలమ్మ పాలు
 బోసి నవ్వుల పాలు 
బుడిబుడి అడుగుల పాలు
 తడబడు అడుగుల పాలు

 పాలమ్మ పాలు
 బల వర్ధకమైన పాలు 
బూరెల బుగ్గల పాలు
 బాహు పసందైన పాలు

( ప్రపంచ పాలు( క్షీర) దినోత్సవం సందర్భంగా)

===============================================

తెలుగు పరిశోధకులు  
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,  తిరుపతి.
తేది:01-06-2022
సెల్: 9493235992.


కామెంట్‌లు