రెక్కల పక్షి కవిత; -:Dr. లక్కరాజు నిర్మల

 భావ గాంభీర్యత తో
ధీటైన స్వాభిమానంతో
కద లాలీ అనుకున్న అక్షరాలు
కులాల పేరుతో
పేరు ప్రతిష్టలతో
రాజకీయంగా అమ్ముడుపోతున్న వేళ
కవి కూడా రంగులు మారుస్తూ కలాలని
కవిత్వాన్ని ఆర్థిక స్వతంత్రం గా మార్చుకుంటున్న వేళ
కవిత్వం కలం  అక్షరం
నన్ను చూసిన న వ్వాయి
ఇంకా నీ వెక్కడున్నావ్
నీస్థానం ఎక్కడుంది
ధనం కానీ కులం కానీ పదవి కానీ లేని నీవు ముందుకెళ్ళి మాత్రం ఏం చేస్తున్నావ్ అంటూ ముందుకు వెనక్కి లాగుతోంది ముందుకు కదలని కలం  ఎక్కిరిస్తూ తోంది
నీవు ముందుకెళితే నీ పేరు చూస్తే ఎదిగి పోతున్నావని ఈర్షపడే కళ్ళు
నీ ప్రగతిని చూసి ఓర్వలేని
కళ్ళు
నీ ధైర్యాన్ని చూసి పరోక్షంగా నీ గురించి తప్పుడు మాటలు చెప్పే కళ్ళు
కళ్ళకి కళ్ళకి ఇంత తేడానా
రెండు కళ్ళు రెండు చేతులు రెండు పదాల కి నిదర్శనమా
ఓ పలుకు పొగడ్త ఓ
పలుకు విమర్శ
నిన్నటి కొమ్ములు ఇవాళ  చాలా పదును 
సహాయం చేయాలనుకునే చేతులు ఎప్పుడు ఏదో వెతుకుతూ నే ఉంటాయి
కలానికి మాత్రం మంచి చెడు  విజ్ఞానం ఎక్కువ
ఉదయించిన కిరణ మై
కవిత చీకట్లను పారద్రోలుతుంది అని
ఖచ్చితమైన న్యాయాన్ని ధర్మాన్ని పాలిస్తుందని
వేణువై నా దాన్ని ఇస్తుందని
కలం హలమై మనసు మేధ ను పచ్చని పంటలు ఇస్తుందని ఆశతో
మరో సారి కవిత గా
కాగితం మీద అక్షరాలను ముత్యాలుగా ఆడి ముత్యాలు గా ప్రవహించాయి
కామెంట్‌లు