మహా విష్ణువు యొక్క మహిమగల చక్రముయె
సుదర్శనము నామము సూటిగా ఛేదించు
అట్టి చక్రాయుధము అతిశక్తి వంతమును
జనియించె నీనాడు జగములే హర్షించ
తమిళ నెల "ఆడి"లో తాను జనియించినది
ధర్మముకు రక్షణగ ధన్యతను పొందినది
వాస్తు శిల్పియయిన వాసి విశ్వకర్మయె
సూర్య తేజమందున సుదర్శన చక్రమిడె
త్రిమూర్తుల యంశతో త్రిలోకమ్ము లందున
మహా శక్తి గలిగిన మాయా సుదర్శనము
ఖాండవ వనదహనము ఖండితముగా జరుగ
కృష్ణార్జునులు జేయ కృపనొంది యగ్నియే
సుదర్శన చక్రమును శుభ కౌమోదకినీ
జాపత్రిని బహుమతి జయమునకు నొసంగెను
దశావతారములను దక్షతగ పూజించు
ఫలితమ్ము నిచ్చునట ఫణిరాజు సాక్షిగను
వైష్ణవము శాఖలును వైయుక్తికముగాను
ఇంట పూజించుదురు నిట్టి చక్రము ఘనత
శత్రునాశని గాను శరణమును కల్పించు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి