"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 75,వ బాగం) "నాగమణి రావులపాటి "
కుసుమా పూర్ణా నేనూ అలా పాండురంగ 
ఆలయానికి వెళ్ళి వస్తాము  ఇక్కడ ఫేమస్ గుడి
కదా పర్మిషన్ ఇస్తావా ,అని కుసుమ ను అడిగాడు
వేణు నీతో నా నేను రాను వైభవ్ ను తీసుకు వెళ్ళు
అని అన్నది, పూర్ణిమ....నాతోనా అంటే నేనమన్నా
దుర్మార్గుడినా గీత తమ్ముడి నేగా .....!!

అని అన్నాడు వేణు... సరే లేవే పూర్ణా గుడికేగా
వెళ్శీరండి  వేణు చూడలేదుగా చూసినట్టు 
వుంటుంది త్వరగా రండి ఈ లోగా వంట
చేస్తాను అని అన్నది కుసుమ.........!!

అబ్బా తప్పించు కుందామని అనుకుంటే అక్క
పర్మిషన్ ఇచ్చింది ఇంకా వేణు ఊరుకుంటాడా
దేవుడా అని మనసులో అనుకుని తయారు
కావటానికి లోనికి వెళ్ళింది పూర్ణిమ...........!!

అందాల లోకంలో ఆనందాల అలరింతలో
పరువం పాపిట మురిపాల సింధూరంలా
మెరిసే అందాల భరిణె లా తయారైన
పూర్ణిమను చూసి మెచ్చుకోకుండా వుండలేక
పోయాడు వేణు.........!!

పూర్ణా ఎంత అందంగా వున్నావే దేవుడు
నాకోసమే పుట్టించాడు నిన్ను... లేకపోతే
ఏమిటి చిన్నప్పటి పరిచయాలు అనుకోని
బ్రేక్ తో మీరు ఇక్కడికి రావటం మళ్ళీ మనం
పెద్దయ్యాక ఇలా కలుసుకోవటం అంతా
ఆ దేవుని కటాక్షం ఏమంటావు అని అన్నాడు 
వేణు.(సశేషం)....................!!

కామెంట్‌లు