"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 82,వ,బాగం)--"నాగమణి రావులపాటి "
 ఇప్పటివరకూ జరిగిన కధ
కుసుమ ఒక మద్యతరగతి లో పెరిగిన అమ్మాయి
తమ్ముడు చెల్లి తాను ముగ్గురు సంతానం...తండ్రి
ఒక స్కూల్ టీచర్...తల్లి ఉన్నంతలో సంసారం బాధ్యతలు చూసుకునేది........‌.....!!
రాహుల్ తల్లిదండ్రులు ధనికులు...అక్కా
తనూ ఇద్దరు సంతానం....మంచి చదువు చదివాడు
తలవని తలంపుగా కుసుమతో పరిచయం ప్రేమగా చిగురించి విడలేని బంధంగా మారింది.....‌‌!!
 కుసుమా వాళ్ళు ప్యూర్ వెజ్ ,,,రాహుల్ వాళ్ళు
నాన్ వెజ్,,,, రాహుల్ కు బ్యాంకులో జాబ్ రావటంతో ఆనాటి సాంప్రదాయంలో పెద్దలు పెళ్ళికి ఒప్పుకోరు
కనుక రిజిస్టర్ మేరేజ్...చేసుకుందామని  నిర్ణయించుకున్నారు..........!!
ఇంతలో అనుకోకుండా కుసుమ తల్లి, తండ్రులు
ఒక దుర్గటనలో ప్రాణాలు కోల్పోయారు....
చెల్లి తమ్ముడు బాధ్యత తనపై పడిన కారణాన
తను ఎంతగానో ప్రేమించిన ప్రేమను విడనాడి
రాహుల్ కు చెప్పకుండా వాళ్ళ సొంత ఊరు బందరు
వెళ్ళి పోతుంది ...........!!
తన ఉనికిని ఎవరికీ చివరికి తనప్రాణ స్నేహితురాలు
గీతకు, కూడా, తెలియనీయక, జాగ్రత్త పడుతుంది..‌‌
ఎన్నో కష్టాలు పడి తోడబుట్టిన వాళ్ళకు తల్లీ తండ్రీ
తానై చూసుకుంటుంది..........!!
కుసుమ పై ప్రేమను చంపుకోలేక ఆమెకోసం 
 వేరే పెళ్ళి ఊసు రానీయక ఆమెకై
అన్వేషిస్తూ బ్యాంకు జాబ్ చేసుకునే రాహుల్ కు
బందరు బదిలీ కావటం,అదే బ్యాంకులో, కుసుమ
లోను, తీసుకున్న కారణంగా, పరస్పరం ఇద్దరూ
ఎదురు పడటం సంభవిస్తుంది............!!
ఒకరి గురించి ఒకరు తెలుసు కోవటం,మనుషులు
దూరంగా వున్నా, మనసులు, ఒకటిగా, ప్రేమను
భద్రంగా, హృదయంలో, పదిలపరుచుకున్న, వారు
కుసుమ తోడబుట్టిన,వారి వివాహాలు, జరిపించి
బాధ్యతలను,నిర్వర్తించాక వివాహం చేసుకోవాలని
అప్పటిదాకా, స్నేహితులుగా, వుందామని, నిర్ణయానికి వచ్చారు..................!!
కుసుమ జిరాక్స్ సెంటర్ టైలరింగ్, కాక ,కాఫీ
షాప్, కూడా రన్ చేస్తూ అంచెలంచెలుగా కాఫి
షాప్ నుంచి కాఫీ గింజలతో కాఫీ పొడి తయారు చేసే
పెద్ద కర్మాగారాన్ని, నిర్మించి, గొప్ప వ్యాపార వేత్తగా
ఎదిగిన వైనం బహు రమణీయం........
గీతకు, కుసుమ, జాడ తెలియటం, గీత తమ్ముడు
వేణూకు,కుసుమ చెల్లి పూర్ణిమను,ఇచ్చి వివాహం
చేయటానికి, పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది.....
ఇంకా, కుసుమ తమ్ముడు, వైభవ్, కాఫీ బిజినెస్ లో
ఆరి తేరాడు ...............‌!!
కాఫీ వ్యాపార సంబంధిత పెట్టుబడీదారి వైజాగ్
నివాసి పరసురామ్ గారితో లావాదేవీల కారణంగా
ఆయన ఇంటిలో కలిసిన వైభవ్ కు ఆయన కుమార్తె
నీలిమ పరిచయం కావటం ఆ పరిచయం ఇరువురికీ
ప్రేమగా మారటం సంభవిస్తుంది........!!
నీలిమ అమెరికాలో చదువు పూర్తీ చేసింది అక్కడే
జాబ్ కూడా వచ్చింది... ఈ కారణంగా, వైభవ్ ను
అమెరికాలో,కూడా కాఫీ బిజినెస్, స్టార్ట్ ,చేయమని
ప్రొద్బలం, చేసింది.. పరశురామ్ గారు సపోర్ట్ చేసారు
కుసుమా రాహుల్.లు...నీలిమా వైభవ్ ల ప్రేమను
గమనించారు.............!!
పరశురామ్ గారితో  ఈ విషయం సంప్రదిస్తుంది
కుసుమ...పనిలో పనిగా తన కుటుంబ కధని
రాహుల్ తో తన ప్రేమని పెళ్ళిని చెప్పేస్తుంది...
ఆయన కుసుమా రాహుల్ త్యాగానికి ......
తోడబుట్టిన వాళ్ళను, పెంచిన, విధానానికి
అబ్బురపడి, తనే దగ్గరుండి, మీ ఇరువురికీ
వివాహం జరిపిస్తానని, కుసుమకు, మాట ఇస్తారు..
ఈ క్రమంలో రాహుల్, వాళ్ళ,నాన్నగారికి,హార్ట్
ఎటాక్, రావటంతో, హుటాహుటిన, రాహుల్
తండ్రి దగ్గరకు వెళ్ళటం, ఆయనకు ,ప్రాణం గండం
తప్పటంతో ఊపిరి పీల్చుకున్న వారై, కుసుమకు
కాల్ ,చేసాడు, రాహుల్.......!!
పూర్ణిమా,వేణూల పెళ్ళి, శుభలేఖను,తీసుకుని
మన ఇంటికి రా అని చెప్పగానే గాలిలో తేలిపోతూ
వెళ్ళటానికి, నిర్ణయించుకుంటుంది, కుసుమ ...
ఇక్కడ మీకో విషయం చెప్పటం మరిచాను....
ఒక సందర్భంలో, రాహుల్ ,కుసుమలు, హంసలదీవి
వెళతారు................!!
అక్కడ కొలువైన,వేణుగోపాలస్వామి సన్నిధిలో
వేద,మంత్రాల, నడుమ, పూలమాలలు ఒకరి
మెడలో ఒకరు వేసుకుని వివాహం చేసుకుంటారు...
కానీ ముందు అనుకున్న నిర్ణయం ప్రకారం....
పెద్దలు సమక్షంలో వివాహం జరిగేవరకు మునుపటి
లాగానే వుండాలి అని, అనుకుంటారు..........!!
రాహుల్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కుసుమ అంటే
ఇష్టం,వున్న, కారణాన ఆమెను పెళ్ళి చేసుకునే
విషయం తెలియజేస్తాడు, రాహుల్....అందుకే
కుసుమ చెల్లెలి పెళ్ళి పిలుపుకు రాహుల్.ఇంటికి
రమ్మని తెలియజేస్తాడు.‌..(సశేషం)........!!

కామెంట్‌లు