"తెలంగాణబోనాలపండుగ-కాళీమాతస్తుతి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి :- 6300474467
సీ.

భద్రంగగాపాడుభద్రకాళీమాత
బోనాలనర్పించిపూజజేతు
రోగాలనణచియారోగ్యమ్మునిప్పించి
శక్తిప్రసాదించిశాంతినొసగు
కష్టనష్టాలనుకడుదూరముంచియు
లాభాలుజేకూర్చురమ్యముగను
దుష్టులదునుమాడి,శిష్టజనులకును
మోదమ్ముగల్గించిమోక్షమొసగు
(తే.గీ.)
నిన్నునమ్మితినెప్పుడునెమ్మనమున
నీదునామమేజపియింతు,వాదమేల?
నీపరీక్షకుగురియైతి‌,కోపమేల?
ఉండలేనమ్మనీభక్తిఊసులేక!!!


కామెంట్‌లు