హలంవీరుడు;-సి. శేఖర్(సియస్సార్),పాలమూరు,9010480557
మొద్దుబారిన నేలనొక్కసారి
హలాన్ని చేతబట్టి
దుక్కినంతా చదునుచేసే
మొనగాడు రైతన్న

ఒక్క వానతో 
తన అడుగులన్నీ
పొలంవైపే మరి
చిందే ప్రతి స్వేదబిందువు
పుడమినుండి పసిడిపంటలను పిలిచి 
ధరణిలోని జీవరాశులందరికీ
ఆకలిమంటలను చల్లార్చే అక్షయపాత్ర రైతన్న

చీకట్లో సైతం పంటను
పసిబిడ్డలా కాపాడుతాడు
తడారకుండా వొళ్ళంతా కళ్ళుజేసుకుని రక్షణకవచమైతాడు రైతన్న

కలోగంజో తాగి 
కడుపుమాడ్చుకునైనా
అప్పులభారాన్ని తలనెత్తుకుని ఎదిగేపంటకు ఎరువులనేస్తూ 
పంటకు బలాన్నిస్తాడు రైతన్న

ఉరుములు ఉరిమి మెరుపులు మెరిసి
పిడుగులురాలిన 
పంటను రక్షించడమే లక్ష్యం
ఎదిగొచ్చిన పంటను ఎదకత్తుకుంటాడు రైతన్న

కొండలైనా కోనలైన
తన పాదదూలితో పావనమై
పరవశించిపోయి పైరులతో అలరారుతాయి
అలసటేతెలియనితనాన్ని మనసుకద్దుకొని 
మనసుపెట్టి పనిచేసే మహావీరుడే రైతన్నకామెంట్‌లు