వానదేవుడు;-మమత ఐలకరీంనగర్9247593432
 క.
నిప్పుకు మిన్నగ నేనని
నుప్పెన వలె దూకినావు వువ్వెత్తున నీ
తప్పెటలో ముంచిళ్ళను
కప్పెడి బీభత్సమునకు కారణమేమౌ!
క.
గోవర్ధన గిరినెత్తుచు
బ్రోవగ కృష్ణయ్య రాడు భూలోకముకున్
దైవము సూర్యుడు చంద్రుడు
నీవుని కేదనుచు రవిని నిలిపితివేమో!
క.
భువిలో కోతులు గలరే
రవికిది యాషాఢమనుచు లాస్యము జేయన్
సవరణకై విడిచితివా!
సువర్ణ రేఖలను గనుమని చూసితిమయ్యా!🙏

కామెంట్‌లు