తే.గీతులు
ఎదురు చూడంగ పుట్టిన మధుర ఫలము
నొక్కగానొక్క పుత్రుడు మక్కువితను
జన్మతో నంధకారంబు జగతిజూడ
నోచుకోలేదు గనుమని నుతిని వేడఁ
పూర్వజన్మలో సతికండ్లు పొడిచెననుచు
గురువు సెలవిచ్చె గతజన్మ గురుతు లన్ని
నాటి పాంపంబె శాపమై నేటి యందు
పుట్టు గుడ్డిగా బుట్టెనీ పుత్రుడనెను
జన్మ మర్మంబు జెప్పినన్ జగతిజూడ
నయనముల మీద కరముంచి నమ్రతగను
తెరువమనగానె తెరిచెను పరవశించి
చూపు దక్కిన నయనాలు సుధలుగురిసె
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి