దత్తపదులు:- అందము..చందము..మందము.. గంధము
ఉ.
అందము సుందరమ్ము వినయమ్మును గ్రోలిన నద్భుతంబుగన్
చందము జిమ్మి ముంచు మరి సౌధము నుండెడి యెల్లలందరిన్
మందము గానిబుద్ధి గుణ మందిరమందున నందరుందురే
గంధము పూసినట్లుగనె కమ్మని ప్రేమను గాంతురెప్పుడున్
తే.గీ
అందమైనట్టి సుగుణమ్ము బంధమౌచు
చందముగ వెల్గులీనును సుందరముగ
మందమును గాంచు బుద్ధికానంద మేము
గంధమైనను గాంచక గరిమ యనును

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి