ప్రగతి వెల్గులు;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
బాల పంచపదులు
 ==================
1.గ్రామాలు సాలగ్రామాలు!
   శాంతికి పుణ్యధామాలు!
   స్వచ్ఛతకి ఆరామాలు!
   సహాజీవన ఆశ్రమాలు!
పల్లెలు, ప్రగతి,వెల్గులు ,రామా!

2.దేశానికి పట్టుకొమ్మలు!
   అందానికి ముద్దుగుమ్మలు!
  విరిసిన కొమ్మలు రెమ్మలు!
  నగర పోషణలో అమ్మలు!
పల్లెలు, ప్రగతి,వెల్గులు, రామా!

3. పాడిపంటల భాగ్యసీమ!
    ఆరోగ్యానికి భవ్యసీమ!
    ఆనందానికి స్వర్గసీమ!
    పల్లెబతుకు అమ్మప్రేమ!
 పల్లెలు, ప్రగతి,వెల్గులు,రామా!
_________


కామెంట్‌లు