జీవితం ఓ సవాలా!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
        1.కర్తవ్యం!

1.బొగ్గయి రగలాలి!
   మబ్బయి కురియాలి!
   మట్టి అయి పండాలి!
   జీవితం ఓ సవాలా!

2.స్తబ్ధత కూడకు!
   జడత్వంతో జతకూడకు!
   మౌఢ్యంతో మాటాడకు!
   జీవితం ఓ సవాలా !

3.తలవంచకుంటే!
   తల పైకెత్తి నిలబడితే!
   తాహతుతో సాగుతుంటే!
   జీవితం ఓ సవాలా!

4.నీవు జ్వలిస్తే!
   నీ బుద్ధి ప్రజ్వలిస్తే!
   సిద్ధి సాధిస్తే!
   జీవితం ఓ సవాలా!

5.ఆశయం బలిసి!
   ప్రయత్నం కలిసి!
  వెరసి నీలో కసి!
  జీవితం ఓ సవాలా!
_________


కామెంట్‌లు