ఆనంద(ఇం)ధనం!;- డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
బాల పంచపదులు
==================
1కృష్ణునిమాట వినోదం!
  కృష్ణుని పాట వినోదం!
  కృష్ణుని ఆట వినోదం!
  కృష్ణుని బాట వినోదం!
 వినోదం ,
    ఆనంద(ఇం)ధనం ,రామా!

2.పరమాత్మ సృష్టి వినోదం!
   పరమాత్మ దృష్టి వినోదం!
   కళల పరమార్థం వినోదం!
   క్రీడల ప్రయోజనం వినోదం!
   వినోదం,
      ఆనంద (ఇం)ధనం, రామా!
3.వినోదం ఆనంద కారకం!
    వినోదం విషాద సంహారకం!
    వినోదం జనశుభ పూరకం!
    వినోదం జగశాంతి ప్రేరకం!
    వినోదం,
     ఆనంద (ఇం)ధనం, రామా!

4..వినోదం ఆనందం ఉపదేశం!
  వినోదం. ఆత్మీయ ఆలోచనం!
  వినోదం  నైతిక నియంత్రణం!
వినోదం విలువల నిమంత్రణం!
 వినోదం,
      ఆనంద(ఇం)ధనం, రామా!

5.నేడు వినోదం వ్యాపారం!
   భారీ ఆవేశం, దౌర్జన్యం!
   చోటుచేసుకున్న అశ్లీలం!
   లోపించిన నిజ ఉద్దేశం!
   వినోదం,
      ఆనంద(ఇం)ధనం,రామా !

6.వినోదాన, 
             హాస్యం అపహాస్యం!
   వినోదాన,
                హాసం పరిహాసం!
   వినోదాన,
               మాట వెటకారం!
   వినోదాన,
              చేష్ట సూరేకారం!
  వినోదం,
      ఆనంద(ఇం)ధనం, రామా!
________


కామెంట్‌లు