మున్షీ ప్రేమ్ చంద్;--రాథోడ్ శ్రావణ్ లెక్చరర్, ఉట్నూర్ ఆదిలాబాద్,9491467715
 ఈ రోజు హిందీ నవలా చక్రవర్తి
మున్షీ ప్రేమ్ చంద్ గారి142 వ జయంతి
----------------------------------------
ఆ ధునిక హిందీ సాహిత్యంలో  నవల రచయితలలో అగ్రగణ్యుడు, నవలా చక్రవర్తి  పేరుతో ప్రసిద్ధి గాంచిన కవి, రచయిత, ఉపాధ్యాయుడు మున్షీ ప్రేమ్ చంద్  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములోని  కాశి సమీపంలో ఉన్న లమహీ
అనే గ్రామంలో 1880‌ లో జూలై 31న  శ్రీమతి/ శ్రీ ఆనంది దేవి అజాయబరాయ్ పుణ్య దంపతులుకు నిరుపేద కుటుంబంలో జన్మించారు.ఇతని అసలు పేరు ధన్ పత్ రాయ్, మహా మేధావి అవటం వలన దూర విద్య సంస్థల ద్వారా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసారు.
కుటుంబం
  వీరు కాయస్థ జాతికి చెందిన శ్రీవాస్తవ కుటుంబానికి చెందిన వారు. ఇతని తండ్రి ఆంగ్లేయుల పాలనలో  ఒక పోస్ట్ ఆఫీసు కార్యాలయంలో  దిగువ శ్రేణి గుమాస్తాగా పని చేసేవారు.తల్లి ఎప్పుడూ ఏదో ఒక ఆనారోగ్య సమస్యలతో  బాధపడేది. అందుకే వారి కుటుంబం కటిక దారిద్య్రంలో ఉండేది.ఇంతా దయనీయ స్థితిలో కూడా తన యొక్క సిద్ధాంతానికి విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించ లేదు మున్షీ
ప్రేమ్ చంద్. ఎనిమిది ఏళ్ళ వయసులో తల్లి చనిపోవడంతో నలభై ఏళ్ళ వయసులో  తండ్రి మరోక పేళ్ళి చేసూకోవడంతో  సవతి తల్లి అంతగా పట్టించుకోక పోయేది. 14 సంవత్సరాల వయస్సులో తండ్రిని కోల్పోవడంతో కుటుంబ భారం అతని మీద పడ్డాయి. అతని వివాహము ఫత్తేపూర్ జిల్లాలోని సలేంపూర్ గ్రామంలో  మున్షీ దేవి ప్రసాద్ గారి కూతురు శివరానీ దేవితో వివాహం జరిగినది. అతని ఇద్దరు కుమారులు ఒకరు శ్రీపత్ రాయ్, రెండవ వాడు అమృత రాయ్.
విద్యాభ్యాసం
తొలి సారిగా అతని విద్యాభ్యాసము
ఉర్దు, పార్సీ భాషలో ప్రారంభమైనది. బాల్యం నుండే చదువులో రాణించేవారు.
విద్యార్థి దశలో హిందీ నేర్చుకోలేదు.గురువు మౌలవి గారి సూచనల మేరకు హిందీలో ఆసక్తి కనబరిచి ప్రతి రోజు కాలినడకన బెనారస్ లోని పాఠశాలకి వెళ్లి విద్యనభ్యసించేవారు. ఇంటి పరిస్థితితులు బాగుగా లేకపోవడంతో  అచ్చట విద్యార్థులకు ట్యూషన్ చేపుతు వచ్చిన ఫీజులతో  క్వీన్స్ కళాశాలలో చేరి 1994 లో మెట్రిక్యులేషన్ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. 1914లో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గణితము రాకపోవడంతో బి ఏ ఆర్ట్స్‌డిగ్రీ యందు ఘోరక్ పూర్ కళాశాలలో చేరి 1919 లో  బిఏ డిగ్రీ కూడా ఉత్తీర్ణులైనారు.
 అప్పటి బ్రిటీషు ఇండియా ప్రభుత్వ  విద్యాశాఖలో  ఉపాధ్యాయుడుగా నియమితులై అంకిత భావంతో విధులు నిర్వహించారు.18 రూపాయలు నెలసరి వేతనంతో ఉపాధ్యాయునిగా క్రైస్తవ మిషనరీ పాఠశాలలో పని చేశా రు.
 ఉపాధ్యాయ వృత్తిలో అంచలంచెలుగా ఎదిగి
 డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కుల్ గా సేవలందించారు. 1920 లో భారత జాతి పిత మహాత్మా గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కుల్ పదవికి రాజీనామా చేసి జైలుశిక్ష కూడా అనుభవించారు.
సాహిత్య సేవ
విద్యార్థి  దశ నుండే  సాహిత్యంలో  మక్కువ కనబర్చేవారు. నవాబ్ రాయ్ పేరుతో రచనలు కొనసాగిస్తూ సాహిత్య జీవితాన్ని అలవాటు పడిన తర్వాత  సమయాన్ని కూడా మరచి పోయేవారు.అతని సాహితీ సేవ విషాదంగా, విపులంగా మరియు బిన్నంగా ఉండేది. పదమూడో సంవత్సర చిన్న వయస్సులో  ఉర్దులో ఒక నాటకం రాయండి తదనంతరం  వెనువెంటనే  కజాకీ, రామలీలా,ఢపోరశంఖ, బెంటోవాలి విధవ, సౌతెలిమా మొదలగు కథలు రాశారు. అతను తన యొక్క జీవితకాలంలో దాదాపు 300 కథలు రాయడం ఈ కథల సంకలనం మానవసరోవరంలోని  ఎనిమిదవ భాగంలో  ప్రచురించారు. అతని కథలలో  మనిషి యొక్క యదార్ధ సత్యమును, రైతులు , రైతుకూలీల దుర్భర జీవితాన్ని   
సానుభూతిని తెలిపారు.  
అతను రాసిన కథలలో అనేక కథలు సమాజం పైననే చిత్రించడం జరిగినది.శంఖనంద్, పంచ్ పరమేశ్వర్, బుడికాకీ మొదలగు ప్రసిద్ధి గాంచిన కథలుగా చెప్పుకొవచ్చు.
దానితో పాటు అనేక నవలలు రాయడం అతను రాసిన నవలల్లో ప్రతిజ్ఞా, వరదాన్, సేవాసదన్,ప్రేమాస్రమ్, నిర్మలా, రంగభూమి,కాయాకల్ప,గబన్ , కర్మభూమి, గోదాన్ నవలలు ప్రతిది కూడా  ఏదైనా ఒక సమస్యలను కేంద్ర బిందువుగా చేసుకుని రాయడం ఒక ఎత్తు అయితే
సమస్యలే కాదు వాటి పరిష్కార మార్గాలను కూడా అన్వేషించి చక్కగా లిఖించడం మరో ఎత్తు అని భావించవచ్చు.సేవాసదన్ నవలలో వేశ్యల సమస్యలు, నిర్మలా నవలలో  వివాహం వలన ఉత్పన్నమయ్యే సమస్యలు, గబన్ నవలలో  స్త్రీ సమస్యలు గురించి చక్కగా వివరించారు.
ప్రేమ్ చంద్ నవలలోని ప్రతి పాత్రలను ఒక ప్రతినిధి పాత్రధారిగా రూపొందించడం అతను రాసే స్త్రీలు, పురుషుల పాత్రలలో మనకు ఆదర్శ వాదం కనబడుతుంది.అతని నవలలో త్యాగం, శీలం అనే గుణాలు అధికంగా కన్పిస్తాయి.ప్రతి రచనలలో  ఆదర్శము, యధార్థ వాదం యొక్క చిత్రీకరణ జరిగినది. నవలలో కఫన్, సతరంజ కే ఖీలాడి, బడె భాయీ సాహబ్,మూక్తి మార్గ,‌పూస్ కీ రాత్, ఠాకుర్ కా కూఆ, మొదలగు కొన్ని శ్రేష్టమైన నవలలు.పూస్ కీ రాత్ కథ అతనికి మంచి పేరు సంపాదించి పెట్టింది. తను రచించిన ప్రసిద్ధ నాటకాలలో కర్బలా, సంగ్రామ, ప్రేమ్ కీ వేది ముఖ్యమైనవి.
పత్రిక రంగంలో
తొలి సారిగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములోని కాన్పూర్ నుంచి వెలువడే జమానా పత్రికలో పని చేసారు.ఆ తరువాత లక్నో నుంచి వేలువడె మాధూరి పత్రికకు సంపాదకులుగా,  మర్యాద పత్రికలో ముఖ్య సంపాదకులుగా వ్యవహరించారు.హంస, జాగరణ్ పత్రిక వలన అత్యంత   ప్రసిద్ధి చెందారు.
 అనేక  వ్వాసాలు రచించారు అవి వివిధ దిన పత్రికలో ప్రచురించాయి.బాష చాలా సరళంగా అర్థవంతమైన పాత్రలో  సందర్భోచితంగా సామేతలు, జాతీయాలు ఎక్కువగా ప్రయోగించడం జరిగినది. హిందీ కథాసాహిత్యంలో  నవలలకు దిశానిర్దేశం చేసిన గొప్ప రచయిత నవలాకారుడు మున్షీ ప్రేమ్ చంద్ 1936 అక్టోబర్ 8 న వారణాసిలో పరమపదించారు.


కామెంట్‌లు