ఆచార్య రాఘవాచారిగారు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.949281132
 విజయవాడ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు  నిలయం ఏ ఆర్ కృష్ణ గారు హైదరాబాద్ లో ఎంతో కష్టపడి శకుంతల నాటకాన్ని ప్రదర్శించడానికి విజయవాడలో ప్రదర్శించిన కార్యక్రమంలో  విశాలాంధ్ర పత్రిక సంపాదకులు సి. రాఘవాచారి గారు అధ్యక్షులు. ఆ కార్యక్రమంలో అనేకమంది వక్తలతో పాటు అరుణా వ్యాస్ ని కూడా పిలిచారు. వ్యాస్ గారు పేరు మోసిన పోలీస్ ఆఫీసర్. కనుక ఆమెను పిలిచారు లేకపోతే ఆవిడకి సాహిత్యం ఏమిటని  ప్రేక్షకులలో గుసగుసలు. దానికి తగినట్లుగానే ఆమె ప్రసంగం కూడా సాగింది ఆమె ప్రారంభించడం మధ్యలో మర్చిపోవడం దానిని రాఘవాచారి గారు అందించడం. నేను విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యురాలిని అంటూ వారి పద్యం చెప్పబోతే రెండు పాదాలు చెప్పిన తరువాత  రాఘవాచారి గారు అందిస్తే  చెప్పింది. విసుగెత్తిన కృష్ణ గారు  నీకు ఆంగ్ల సాహిత్యం మీద పట్టు ఉండవచ్చు  తెలుగు నాటకాల గురించి నీకేం తెలుసు. కాళిదాసు రాసిన ఈ నాటకాన్ని ఎంతో కష్టపడి ప్రదర్శిస్తున్నాం. కథానాయిక కావాల్సి వస్తే  శకుంతల  అందాన్ని మించిన అందగత్తె ఉన్న బంగ్లాదేశ్ అమ్మాయిని ఎన్నుకున్నాం.  తెలుగు రాదు ఆమెకు మన భాషను నేర్పించాం షేక్స్పియర్ ను మించిన నాటకాలు మనకు చాలా ఉన్నాయి అవి మీకు తెలియదు అక్కడ రాఘవాచారి గారి విలువ నాకు అర్థమైంది. సభ నిర్వహించడంలో ఎంత శ్రద్ధ ఉండాలో, ఎంత లౌక్యం ఉండాలో ఎంత సత్తాఉండాలో నిరూపించారు ఆయన. పంచకావ్యాలు పాఠం చెప్పుకున్న పండితులు  వామపక్ష సిద్ధాంతాలకు కట్టుబడి కార్ల్ మార్క్స్ కి మార్క్సిజం గురించి చెప్పగలిగిన ఘటికుడు. పత్రికా నిర్వహణలో ఎలాంటి  సామర్థ్యం  ఉండాలో నిరూపించారు. నాకు గురువు గారు ఉషశ్రీ గారికి, నా సహాధ్యాయి డాక్టర్ రామకోటి రెడ్డికి  చాలా మంచి స్నేహితులు, మంచి వక్త. ఏ కార్యక్రమానికి వారు వెళ్లినా దానికి సంబంధించిన విషయాలు తప్ప మరొకటి మాట్లాడరు. ఉషశ్రీ గారికి కూడా సలహాలు ఇవ్వగలిగిన ప్రజ్ఞావంతులు. నిజానికి గురువుగారికి ఏ సందేహం వచ్చినా వారినే అడుగుతారు  రాఘవాచారి గారిని ఎప్పుడు పేరుతో పిలవలేదు ఆ శ్రీ వైష్ణవుడు అనే సంబోధించేవారు. ఆకాశవాణిలో అనేక కార్యక్రమాలను అలవోకగా నిర్వహించిన  నిర్వాహకులు.
అందరితోనూ ఎంతో చనువుగా, ఆప్యాయంగా అభిమానంతో మాట్లాడే మనస్తత్వం. నిజానికి అజాతశత్రువు ఏ రకమైన పండితులతో నైనా కలిసిపోయే వారు. మా అబ్బాయి డాక్టర్  శ్రీధర్ రెడ్డి, రాజీవ్ సంస్థను ఏర్పాటు చేసి  అనేక కార్యక్రమాలను  నిర్వహించేవాడు. చాలా కార్యక్రమాలలో  వక్తగా, అధ్యక్షునిగా  వచ్చి  ఆ కార్యక్రమానికి నిండుదనాన్ని తీసుకువచ్చేవారు. మేము చర్ల గణపతి శాస్త్రి గారి  వర్ధంతి సందర్భంగా  రాఘవా చారి గారిని ఆహ్వానించడం శాస్త్రి గారి గురించి వారి కాళిదాసు రచనల గురించి భగవద్గీతను వంట పట్టించుకున్న  జ్ఞాని గురించి ఒక మాట చెప్పారు. వారి కుమారుడు చనిపోయిన రోజు  ఆ భౌతిక దేహాన్ని చూసిన తల్లి ఆ శవం మీద పడి ఏడుస్తూ చనిపోయిన సందర్భంలో శాస్త్రిగారు  "జాతస్యహి ధృవో మృత్యుః" అన్న గీతా వాక్యం ప్రకారం  వారిని స్మశానానికి తీసుకు వెళ్లారు. రాఘవా చారి గారికి తెలియని విషయము అంటూ లేదు అని నేను అనుకుంటున్నాను. ఉషశ్రీ గారు అనేక పర్యాయాలు అనేక కార్యక్రమాలకు  రాఘవాచారి గారు తప్ప మరొకరు  ఈ విషయాల గురించి చెప్పలేరు కనుక వారినే పిలవమనే వారు.  అలాంటి అద్భుతమైన  ఆదర్శప్రాయమైన జీవి  భౌతికంగా మనకు దూరమైనా  వారి ఆశయాలు మనలను నిత్యం ఆలోచింప చేస్తూనే ఉంటాయి. ఆయన ప్రాతఃస్మరణీయుడు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం