అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనం గౌరవించి పూజించవలసిన ముగ్గురిలో (తల్లి, తండ్రి, గురువు) తల్లికి ప్రథమ స్థానం ఇచ్చారు మన పెద్దలు. తప్పటడుగులు వేసినప్పుడు నడక నేర్పేది అమ్మ, సమాజంలో తిరిగేటప్పుడు నడత నేర్పేది అమ్మ, మాటలు నేర్పేది, అక్షరాలు దిద్దించి చదివించేది అమ్మే కదా. అందుకే ప్రతి స్త్రీ తల్లి లాంటిదే "మాతృవత్ పరదారాంశ" అని శతకకారుడు చెబుతాడు మన పెద్దలు చెప్తూ ఉంటారు ఒక నానుడి. భార్య బెల్లం, తల్లి అల్లం అంటారు. భార్య చక్కటి మాటలు నేర్పుగా చెబుతూ ఉంటుంది అది మంచో చెడో తనకు తెలియదు చెప్పడం వరకు మాత్రమే తెలుసు. బెల్లం శరీరానికి ఎంతో చెడు చేస్తుంది. తల్లిని అల్లంతో పోలుస్తారు కారణం మనం తినే అల్లం ఎంత ఘాటుగా ఉంటుందో, అంత మంచి చేస్తుంది అని ఆయుర్వేదం చెబుతోంది. మనం ఏదైనా తప్పు చేస్తే అమ్మ నిజానికి దండిస్తుంది ప్రేమతో భవిష్యత్తు బాగుండాలన్న అభిప్రాయామే తప్ప కోపంతో ద్వేషంతో కాదని ఆ వయసులో మనకు తెలియదు. జీవితంలో స్థిరపడిన తరువాత అమ్మ మనసు ఎంత మెత్తటిదో మనకు అర్థమవుతుంది.
అమ్మ జీవించి ఉన్నంత కాలం మన ఆటలు సాగుతాయి ఏం చేసినా ఆమోదయోగ్యమే ఇతరుల నుంచి మాట పడకుండా కాపాడేది అమ్మే, ఆకలయితే ఆప్యాయంగా అన్నం పెట్టేది అమ్మే జీవితంలో వ్యక్తి పద్ధతి ఎంత బాగుంటే అంత గౌరవాన్ని పొందుతాడు. జీవితం మూడునాళ్ళ ముచ్చట అది ముగిసేలోపే మన సమాజానికి ఏం చేయగలమో అది అంతా చేయాలి అప్పుడు భౌతికంగా మన ఈ శరీరాన్ని వదిలి వేసినా మన పని శాశ్వతంగా నిలిచి ఉంటుంది అంటాడు వేమన.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి