బడి పిలుపు(బాల గేయం);-గుండాల నరేంద్రబాబు --సెల్: 9493235992.
చకచకా లేవండి రా 
వడివడిగ నడవండి రా

మన బడి పిలుస్తుంది రా
బిర బిర అడుగులేయ రా

జర జరా కదలండి రా
  నాడు నేడూ చూడ రా

 అందాల బడి మనది రా 
 విధేయతనే చూప రా

 బడికే వెళ్ళాలీ రా 
 గుడిలాగ మెలగాలి రా

విద్యా కానుక నీకే
అమ్మఒడి సొమ్ము నీకే

కమ్మగా చదవాలి రా
గొప్పగా ఎదగాలి రా
========================== 
(  తేది:05.07.2022 పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా)

కామెంట్‌లు