ఒక అమ్మాయి ప్రయాణం;-బొల్లి రఘుపతి 9600047259.

 ఒక అమ్మాయి ప్రయాణం (జర్నీ ఆఫ్ ఎ గర్ల్ ఛైల్డ్) ఆంగ్లం లో  శ్రీమతి ప్రేమా శివరామన్ రాశారు.దీన్ని నేను తెలుగు లో అనువదించాను.నాపేరు బొల్లి రఘుపతి 9600047259.హోసూరు లో మెకానికల్ ఇంజనీర్ ని!ఈపుస్తకం తమిళ  ఉర్దూ భాషల్లో  అనువదింపబడింది.దీని వెల 200రూపాయలు.వచ్చే నిధులతో పేద అనాధ పిల్లల కి వెచ్చిస్తున్నారు ఆమె.తెలుగు వారి కి ఆమె బాల్యంని పరిచయం చేస్తాను. 221పేజీల ఈపుస్తకం స్ఫూర్తిదాయకం.
============================
 నర్సింగ్ వృత్తిలో సుదీర్ఘ యానం! బెంగళూరు లో స్థిరనివాసం!1934లో తంజావూరు లోని తిరువిడై మరుదూర్ లో కుంజమ్మాళ్ వైద్య నాధ అయ్యర్ దంపతుల 8వసంతానం ప్రేమ! పసిపాప ను వదిలి తల్లి కర్నూలులో బడిపంతులుగా పనిచేస్తున్న భర్త దగ్గరకు వెళ్లిపోయారు. అమ్మమ్మ పొన్నమ్మ పెత్తల్లి పెంచారు. పెత్తల్లి కొడుకు శ్రీనివాసన్ ఈమె కవలపిల్లలుగా పెరిగారు.కావేరీనదిలో అమ్మమ్మ స్నానం చేయించేది.చేప పిల్లలు కాలివేళ్లను కొరికేవి.నాలుగేళ్ళ ఈపిల్లల తలల్ని నీటిలో ముంచి  బలవంతంగా ఈతకొట్టేలా చేసింది.పాపకి5వ ఏడురాగానే తండ్రి కర్నూలు తీసుకుని వెళ్లారు. రెండు రోజుల రైలు ప్రయాణం లో అమ్మమ్మ  పెద్దమ్మ శ్రీను గుర్తు వచ్చేవారు.తొలి సారి తల్లి అక్కలు అన్నలని చూసిన ఆచిన్నారి త్వరగా అందరితో కలిసిపోయింది. దసరా బొమ్మలకొలువు ఏర్పాటు నాన్న చూసేవారు. కర్నూలులో  ముస్లిం ముల్లాకి అన్నదానం కోసం నాన్న  డబ్బు ఇచ్చేవారు.ముల్లా ఈద్ రోజు గంపనిండా లడ్డూలు  వీరికి ఇచ్చేవారు. తల్లి సిమెంట్ పొయ్యి లో కట్టెలు పెట్టి వంటలు భలే రుచిగా చేసేది. పిల్లలు అంతా రాత్రి నేలపై పడుకుంటే తేళ్లు కుట్టేవి.దారంతో  అక్కడ  గట్టిగా బిగించి తేలుమంత్రం వేసే ఆమె దగ్గరకు పరుగెత్తేవారు అమ్మా నాన్న లు. పచ్చకామెర్లువస్తే చికిత్స కుడు గిన్నెలో నీరు పోసి గుండుసూదివేసి దాన్ని అలా చూడమనేవాడు.నీరు పసుపు రంగులోకి మారేది.నూనె వంటకాలు స్వస్తి పెరుగన్నంతినటమే వైద్యం! వారం కల్లా రోగం మటుమాయం! నేలపై అరటిఆకుల్లో భోజనం  కిర్సనాయలు దీపం దగ్గర చదువు!మాతృభాష తమిళం కావటంతో ప్రేమకు తెలుగు అంతగా పట్టువడలేదు.కానీ తండ్రి వల్ల 5నెలల్లో బాగా చదవటం రాయటం వచ్చింది. లెక్కలు శత్రువులు.
 ఆరోజుల్లో రాతపరీక్ష పాసవ్వాలి.మొదటిప్రశ్న" రాముని వనవాసం అప్పుడు సీత ఏంచేసింది?" ప్రేమరాసిన జవాబు ఇది" సీత పాడుతుంటే రాముడు  డాన్స్ చేశాడు"."వానరులు సముద్రం లో రాళ్ళపై కూచుని  నీరంతా తాగేసి లంక చేరారు. "తండ్రి మందలింపుతో రామాయణం బట్టీపట్టి ఒకటో క్లాస్ పాసైంది.తొలిసారి ప్రేమావతి అన్న పేరు తండ్రి బడిలో రాయించారు.లెక్కల్లో ఎప్పుడూ జీరోలే!టీచర్ బైట నించోపెట్టేది.అక్కలు బడివిషయాలు ఈమె చదువు గూర్చి వెక్కిరిస్తు నాన్న కి చెప్తే ఉడుక్కునేది ప్రేమ!"లెక్కలు రాకుంటే అంట్లుతోముతూ ఇంట్లో పడి ఉండు"అన్న నాన్న మాటలతో రోషం తెచ్చుకుని 5వక్లాస్ పాసైంది. వాలీబాల్ బాడ్మింటన్ వక్తృత్వ పోటీల్లో జయభేరి మోగించి ఇంటా బైట ప్రశంసలు పొందింది. నాన్న పండగలకి ఖద్దరు దుస్తులు కుట్టించేవారు.13వ ఏట 45నిముషాలు కర్నూలు పాతకోట మైదానంలో ఈమె స్పీచ్ విని(ఆంగ్లం తెలుగు లో)శభాష్ అని అంతా మెచ్చుకోటం మధురానుభూతి!పిక్నిక్ లకు తండ్రి  ఈమెను పంపకపోతే తమ తోట లోని ములగ గుమ్మడి పొట్లకాయలు కోసి అమ్మి ఆడబ్బుతో స్కూల్ బస్సు ఎక్కేది.అక్కలు కోపం అవమానం తో ఊగిపోయేవారు.10వక్లాస్ 80%అన్ని సబ్జెక్టుల్లో వచ్చాయి.లెక్కలు పాసుకావాలని 10వేలసార్లు రామనామం రాసి 15ఏళ్ళకే  గమ్యం చేరిన పట్టుదల దృఢసంకల్పం గల విద్యార్థినిగా తనజీవితంకి గట్టి పునాది వేసుకున్న ప్రేమ ఆనాటి పెద్ద కుటుంబాల గూర్చి చక్కగా వివరించారు. 🌹
కామెంట్‌లు