ప్లాస్టిక్ పై అక్షర సమరం; - డా. భరద్వాజరావినూతల 9866203795

 సాహితీబృందావనవేదిక  
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
******** 
4️⃣7️⃣1️⃣)
నాశనం చెయ్యటానికి ప్లాస్టిక్
పర్యావరణ అభివృద్ధి కి చిక్కు
తరిమికొడదాం మనందరం దీనిని
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
******** 
4️⃣7️⃣2️⃣)
వాడుతున్న ప్లాస్టిక్ వస్తువులు
భూమిలో కరగని శిధిలాలు
పశువులకు అనారోగ్య కారకాలు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  
4️⃣7️⃣3️⃣)
 అందంగా కనిపిస్తాయి ఇవి
ఆనందంగా అలరిస్తాయి‌ మనల్ని
 వెనుక దాగుంది ప్రమాదం
 చూడచక్కని తెలుగ సున్నితంబు .---!
******** 
4️⃣7️⃣4️⃣)
 సాంప్రదాయ వస్తువులు వాడరెందుకు
ప్లాస్టిక్ మోజులో బ్రతుకుతారెందుకు
వదలండి‌ వీటిని ఇకనైనా
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  
4️⃣7️⃣5️⃣)
 రంగురంగుల ఈ వస్తువులు
విషపూరిత మిశ్రమాలతో తయారు
చేస్తాయి మనబ్రతుకు తారుమారు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
******
కామెంట్‌లు