అక్షరమాలకు హారతి; -ఇమ్మడి రాంబాబు--9866660531

 అక్షరమాలకు హారతి పడదాం
భాషకు మూలం అక్షరం పదాల బంధనం 
అక్షరాల మాల తోని వాణి శార్వానికి అక్షరాలతో నీరాజనం 
అక్షరాల కుసుమాల మాలకు నా మనసే హారతినిస్తున్న.
జీవిత ఉన్నతికి విజ్ఞాన బలం అక్షరం 
అమ్మ ఒడి బడిలోనే  
మాటల శిక్షణ.
పదాల తొలిగురువు అమ్మ 
పెదవే పలికే తొలిమాట..నాన్న 
 అ -ఆ లా సువర్ణ అక్షరాలను
 నేర్పించేది గురువులు గురుబ్రహ్మ లు.
మనసులోని భావాన్ని కథా రంగాన కవుల కలాల విన్యాసాలు.
.చేసేది అక్షరాలతోనే.. ఆ పదాలతోనే. 
ఉద్యమాల చైతన్య గీతికలకు అక్షరాలే వీచికలు.
సంగీత సాహిత్య పరిమళాలు వెదజల్లేది అక్షరం.
పాలకులకు పామరులకు వారధి పత్రికలు. 
వారికి అక్షరమే ఆయుధం
 ప్రతి సందర్భచిత సంఘటనలకు 
అదే క్రితం అంగీకారమే సంతకం సంతకానికి బీజాక్షరాల అక్షరానికి వందనం.
 అక్షరాల మాలకి భారతి కి సుగంధాల వందనాల హారతి
కలకాలం విశ్వాంతరాళాల లో శాశ్వతం అక్షరం విశ్వాంతర ఖ్యాతి అక్షరానికి మనో నీరాజనం
 

కామెంట్‌లు