తొలి ఏకాదశి; -"శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 🙏రమా నారాయణుడు
 
    శేషపానుపు పైన
    పవ్వళించిన రోజు!
            ఓ తెలుగు బాల!!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
 👌ఆషాఢ మాసంలో, శుక్ల పక్షంలో వచ్చిన "ఏకాదశి" తిధియే.. "తొలి ఏకాదశి" అని వ్యవహరిస్తారు. దీనికి.. "శయనేకాదశి" అని, మరొక పేరు! రమాపతి యైన నారాయణుడు .. ఈ ఏకాదశి నుండి నాలుగు నెలలు పాలసముద్రములో ఆదిశేషుని పైన పవ్వళిస్తాడు! అని, పురాణగాథ! 
 
👌ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు.. అంతరిక్షంలో సూర్యాస్తమయం కాగానే.. ఉత్తరము దిశ వీక్షించిన యెడల; "నక్షత్ర సముదాయం శేషశాయి వలె మనకు, ప్రత్యక్షంగా కనబడుతుంది!" అందువలన, "తొలి ఏకాదశి", పర్వదినం..  మనవారికున్న ఖగోళశాస్త్ర విజ్ఞాన రహస్యమును విశదీకరించు చున్నది!
👌ఆరాధకులు.. ఏకాదశి, పర్వదినము నందు.. నియమ నిష్ఠలతో; ఇష్టదైవమును ధ్యానించి, పూజించు చున్నారు! ఈనాడు..  యధాశక్తిగా, భక్తి ప్రపత్తులతో.. శ్రీశివ పంచాక్షరి, నారాయణ అష్టాక్షరి.. మున్నగు తారక మంత్రములు జపించిన, సాధకులు.. శతాధిక ఫలితములు పొందుచున్నారు!
 ⚜️కందపద్యము⚜️
     శయనేకాదశి అయ్యది
      నయమున ఉపవాస ముండి నైష్ఠిక విధులన్ 
       నియమమ్ము లాచరించిన
ప్రయుతములగు ఫలితములను పడయగ వచ్చున్!! 
( డా. శాస్త్రుల రఘుపతి)

కామెంట్‌లు