బాలల కాంక్ష(బాలగేయం);--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు,సెల్:9966414580.
మొక్కలాగ ఎదుగుతాం
చుక్కలాగ వెలుగుతాం
చక్కని దారుల్లో
పక్కిలై విహరిస్తాం

పుస్తకాలు చుదువుతాం
మస్తకాలు నింపుతాం
అస్తమానం చదువుతూ
నేస్తాలుగా భావిస్తాం

గొప్పగా జీవిస్తాం
ఒప్పుగా నడుచుకుంటాం
తప్పులుంటే దిద్దుకొని
మెప్పు ఎంతో పొందుతాం

అల్లరితో అలరిస్తాం
ఎల్లరిని ప్రేమిస్తాం
చల్లనైన మనసుతో
మల్లె వోలె  వికసిస్తాంకామెంట్‌లు