"ద్రౌపది ముర్ము" గారు;--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు,సెల్:9966414580.
మారుమూల గ్రామంలో
"ద్రౌపది ముర్ము"  పుట్టెను
అంచెలంచెలుగా ఎదిగి
ప్రథమ పౌరురాలాయెను

 మంత్రిగా పని చేసెను
గవర్నర్ గా  రాణించెను
ఆదివాసీ రత్నమై
ఆదర్శంగా నిలిచెను

కష్టాలను ఎదిరెంచెను
బాధలను దిగిమ్రింగెను
మనోధైర్యం చూపెను
రాష్ట్రపతిగా గెలిచెను

అరుదైన గౌరవము
"ద్రౌపది ముర్ము" పొందెను
సంచలనం సృష్టించి
మన దేశ పీఠమెక్కెను


కామెంట్‌లు