(1)
సకల చరాచర జగతిని
తనలోనే...!
అద్భుతం....
ఆకాశాoడము !!
*******
(2)
వాయువు, అగ్ని
జలము, పృధివి
అన్నింటికీ ఆధార భూతం
ఆకాశమే... !
*******
(3)
ఉండీ... లేనట్లు
లేకయే... ఉన్నట్లు
సూర్య, చంద్రులే కళ్ళై !
దైవమే గగనం ! !
********
(4)
గాలి, వెలుతురు
వర్షం - హర్షం
ప్రాణికోటికి సర్వానుగ్రహి
గగనమే... !
******
(5)
ఆకాశము లేక
గాలి, నిప్పు, నీరు, నేల
ఉండబోవు... !
ప్రాణికోటిoక్కెక్కడ !?
*******
(6)
ఓజోన్ కి చిల్లులు
ఆకాశానికి ఆగ్రహం
మాడి పోతోంది
భూగోళం !
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి