నో నాన్న! అచ్యుతుని రాజ్యశ్రీ

 పెద్ద కొడుకు చదివే బడిలోనే రెండో క్లాస్ లో చిన్న కొడుకు ని చేర్చాలని  ఆతల్లి శివా ని తీసుకుని వెళ్లింది.పాతబడిలో ఇంగ్లీష్ మాట్లాడటం రావటంలేదని అమ్మ బాధ!అందుకే కొత్త బడిలో చేర్చేముందు తను మాట్లాడుతూ  శివా కి కూడా నేర్పింది. ఏమీతెలీకపోతే"సారీ"అనమని చెప్పింది.గడుగ్గాయి శివా చూసి రమ్మంటే కాల్చివచ్చే రకం!ఈబడిలో రెండు రకాలుగా ఇంటర్వ్యూ చేస్తారు పిల్లలని.రాతపరీక్ష!ఆపై ప్రశ్న జవాబులతో పిల్లాడి సత్తా నిర్ణయిస్తారు.టీచర్ బెదురు పోగొట్టాలని ముందు తెలుగు లో మాట్లాడుతూ వాడిని అడిగింది "బాబూ! నీవు అమ్మతో ఎక్కడకి వెళ్తావు?" "టెంపుల్ " "అక్కడ ఏదేవుడు ఉంటాడు?" "పేద్ధ రాక్!శివా!" "శివా పైన ఏంఉంటుంది?" టీచర్ అడిగింది. "పెద్ద స్నేక్"వాడిజవాబుకి తృప్తి పడింది టీచర్!పోనీలే వీడికి జనరల్ నాలెడ్జ్  దైవం అంటే తెలుసు అనుకుంది."మీ అమ్మ పేరు?" "కమల!" "గుడ్!మీనాన్న పేరు?" వాడు దిక్కులు చూడసాగాడు. దూరంగా కూచున్న అమ్మ వైపు చూశాడు. "బాబూ "మీనాన్న పేరు?"రెట్టించి అడిగింది. "నో నాన్న!"ఒక్కసారిగా అదిరిపడింది.మెళ్ళో నల్లపూసలు మట్టి గాజులు  బొట్టు తో ఉన్న  కమలని చూసి "ఏంటండీ!మీవారు వేరేచోట విదేశాల్లో ఉన్నారా?"టీచర్ అడిగితే "అబ్బే ఇక్కడే ఉన్నారు " తల్లి జవాబు కి తెల్లబోయింది టీచర్. "మీఅబ్బాయి  నోనాన్న అని చెబుతున్నాడు!?" "శివా! నీకు డాడీ పేరు తెలీదా?వాటీజ్ యువర్ ఫాదర్సు నేమ్?" కమల ప్రశ్నకి "రామారావు!టీచర్ నాన్న పేరు అడిగితే నో నాన్న అని చెప్పాను"గొప్పగా వివరణ ఇచ్చాడు."మరి టీచర్ కి నోనాన్న  అని ఎందుకు చెప్పావు?" "నాన్న  అంటే డాడీ అని నాకేం తెలుసు?"నిలదీశాడు వాడు.కమల మొహం ముటముటలాడించింది.టీచర్ అంది"ఇంటిపేరు అడిగితే ఎ..అనిచెప్పాడు.ఎ..అంటే ఏమోతెలీదు అన్నాడు. డాడీ డ్యూటీ కి వెళ్తాడు అన్నాడు. కనీసం  మన ఇంటిపేరు గుడిలో దైవాల పేర్లు వారిని గూర్చిన కథలు చెప్పవచ్చు కదా?హూ ఈజ్ రామా అంటే దశరథాస్ సన్ అంటారు కానీ  తెలుగు లో  రాముడు ఎవరంటే  డోన్ట్ నో అనే పిల్లలు నేడు! తెలుగు తో పాటు  ఇంగ్లీష్ నేర్పండి. తప్పు లేదు. కానీ తెలుగు లో అర్ధం తెలీకుంటే ఎలా?ఐదోక్లాస్ పిల్ల బ్రింజాల్ బైంగన్ అని  హిందీ లో(ఫస్ట్ లాంగ్వేజ్) చెప్తోంది కానీ తెలుగు లో వంకాయ అని  చెప్పలేదు. మళ్లీ మాటీచర్లనే దుమ్మెత్తిపోస్తున్నారు తెలుగు అక్షరాలు రావటంలేదని!" కమల కుయ్ కయ్ అంటే ఒట్టు!🌹
కామెంట్‌లు