ఐదోక్లాస్ పిల్లల కి ఈఏడాదినుంచి బడిలో పెన్నుతో నోట్సులు రాయాలి. ఇన్నాళ్లు పెన్సిల్ తో రాశారు.నెలరోజులు అవుతున్నా పిల్లల కి కలం చేతబట్టి రాయడం కుదరటంలేదు.వంకర టింకర చిక్కిరిబిక్కిరి రాతలతో నోట్సు ఖరాబ్! రోజూ రెండు బాల్ పాయింట్ పెన్స్ కొనకతప్పటంలేదు.లెక్కలు రోజూ ఉంటాయి. ఆటీచర్కి విసుగొచ్చి మరీచెత్తగా ఉన్నవి పేజీలు చింపేస్తుంది.శివాకి అమ్మ ఇలా సలహా ఇచ్చింది."నాయనా!ముందు పెన్సిల్ తో హోం వర్క్ కుదురుగా రాయి.పైపైన తేలికగా కనపడేట్లు.అంటూ రాసి ఆపై పెన్నుతో దానిపై నోటి తో అనిదిద్దితే బుర్రలోకి ఎక్కుతుంది.నోటికి వస్తుంది. నోట్సు నీట్ గా ఉంటుంది. అమ్మ చెప్పినట్లు గా శివా రాసి శభాష్ అని పెంచుకున్నాడు.శివా నోట్సు చూశాక టీచర్ ఇలా అంది"మనంఏపని చేస్తున్నా దాని పై ఏకాగ్రత ఉండితీరాలి. కుండలు చేసే కుమ్మరి ధ్యాస అంతా తిరిగే చక్రం చేతులపైనే ఉంటుంది. ఒక బాటసారి ఆఊరువెళ్లి"నాబంధువుని కలవాలి అని వచ్చాను.ఏగల్లీ యో తెలీటంలేదు.తెల్లారినా అంతా తలుపులు బిడాయించుకు నిద్రలో ఉన్నారు. నీవు ఒక్కడివే కనపడ్డావు.బాబూ!శివాలయం పక్కనే వారి ఇల్లు అని చెప్పారు. శివాలయం ఎక్కడ?" రెండు మూడు సార్లు అడిగినా కుమ్మరి జవాబు ఇవ్వలేదు. అతను వెళ్లబోతుండగా కుండను సారె మీద నించి తీసి"బాబూ!ఎండాకాలం వస్తోంది. ఇప్పుడే నాకు చేతినిండా పని.నాలుగు డబ్బులు రాల్తాయి.నాచేతులు చక్రం బాలెన్స్ గా తిరగకపోతే మట్టి నాకష్టం వృధా అవుతాయి. "అని సంజాయిషీ ఇచ్చి ఈరోడ్డు సరాసరివెళ్లి కుడివైపు తిరగ్గానే శివా లయం కనపడుతుంది". అలా అతను తనపని ముగిశాక ప్రశ్నను సరిగ్గా విని జవాబు ఇచ్చాడు.విద్యార్ధులుగా మీరు ఇంట్లో ఎంత గడబిడ ఉన్నా మీపని మీరు చేయాలి సరేనా?" అలాగే టీచర్ అంటూ ముక్తకంఠంతో జవాబు ఇచ్చారు అంతా 🌹
ఏకాగ్రత!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి