కాకరకాయ వేపుడు చూద్దాం
కాయలు కడిగి అమ్మకు ఇద్దాం
గాటును పెట్టి గింజలుతీద్దాం
గుట్టుగ ఉల్లికారం వేద్దాం !!
మూకుడులోన గరిటెడు నూనె
చిటపటలాడే పోపుల వాన
కాయలు వేసి మూతను పెట్టు
అమ్మ నెమ్మదిగా కలియాబెట్టు!!
సన్నని మంటా మాడవు అంట
సరిపడు పసుపు ఉప్పెయ్యంట
తెలుగువారి వంట అదిరేనంట
పప్పుచారులోకి కమ్మగా తింటా!!
బెల్లంముక్క చేదుకి దూరం
శాకాహారం ఉండదు భారం
ఆరోగ్యంతో రుచిగా సారం
ఆకులు కాయలుఅన్నీ బలకరం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి