" ఓ నిత్య చైతన్య మూ(స్ఫూ)ర్తీ! ;-బాలవర్ధిరాజు మల్లారం
సాహితీ మిత్రులందరికి  నమస్సులు ! 
29-07-2014 నాడు సాహితీ విశ్వంభరుడు డా.సినారె గారి 84 వ పుట్టిన రోజు సందర్భం గా   ఉదయం 11.10 ని .లకు  చరవాణి ద్వారా సినారె గారికి వినిపించిన కవిత...
========================================
మీ చిన్నప్పటి 
బుడి  బుడి అడుగులను చూసేనేమో...
మన ' మూలవాగు ' 
మెల్ల మెల్లగా నడవడం నేర్చు కున్నట్టుంది 
మీ వడి వడి నడకలను గమనించేనేమో..
మన ' నక్కవాగు ' 
తన ఒర' వడి ' ని  మార్చుకున్నట్టుంది 
మీరు పుట్టిన పల్లె హనుమాజిపేటలో 
నేను ఓ ఐదేండ్లు చదువుకున్నందుకేమో.. 
మా మల్లారం లో నేను ' బాల ' కవిని  అయినట్టున్నాను!
నిజంగానే.. 
మీ మా(పా)ట  
కమనీయం ,రమణీయం ,
మననీయం ,స్మరణీయం ..
మీ బాట  
ఆదర్శనీయయం ,
ఆచరణీయం ,
అనుసరణీయం ! 
మీ బాలవర్ధిరాజు.మల్లారం "
అని అన్నాను. నన్నెంతో ప్రేమగా ఆశీర్వదించారు.
 ఇలా తన ప్రతి పుట్టిన రోజు నాడు చరవాణి లో సినారె గారికి శుభాకాంక్షలు చెప్పడం 1998 నుండి నాకో అలవాటుగా మారింది.
గత ఐదు ఏళ్ళ నుండి ఆ అవకాశం లేకుండా పోయింది.నా మొదటి కావ్యం " ప్రతి స్పందన ' ఆవిష్కరణ (1997 )నుండి  చివరి వరకు సినారె గారితో ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఎన్నెన్నో మరపురాని అపురూపమైన ఘట్టాలు .అవన్నీ సదా మదిలో మెదులుతూనే ఉన్నాయి.నాకు అప్పటికీ,ఇప్పటికీ, ఎప్పటికీ,ఎన్నటికీ మరచిపోని,మరువలేని మధుర జ్ఞాపకం సినారె.
- మీ. బాలవర్ధిరాజు మల్లారం 

కామెంట్‌లు