నక్కబావా ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నక్కబావ నక్కబావ నక్కబావా 
నువ్వెంత టక్కరోడివే నక్కబావా 
గంపకింది కోడిపెట్ట నక్కబావా
నువ్వు మాయంజేసినవ్ నక్కబావా 
గుంజనున్న మేకపిల్ల నక్కబావా 
నువ్వు మాయంజేసినవ్ నక్కబావా
దొడ్డిలోకి వచ్చావా నక్కబావా 
నువ్వు దొంగలా వచ్చావా నక్కబావా
నీ నడ్డిమీద తంతాను నక్కబావా
దొంగబుద్ధి మానుకుంటె నక్కబావా
నీతో ఆటాడుకుంటాను నక్కబావా 
నీచెలిమి చేస్తాను నక్కబావా !!

కామెంట్‌లు