అతివలు; -సాహితీసింధు సరళగున్నాల
ఆ.వె*ఆశతోడనతివలైనవారినివీడి
పరులమోహమనెడి వలనజిక్కి
బయటకేగలేక బ్రతికినదినమెల్ల
చావుదరికిజేరు యావతగ్గి

ఆ.వె*తల్లిమాట వినెడి తనయలెవ్వరునైన
బ్రతుకునందు సుఖము బడయుచుండ్రు
కాదుననెడివారు ఖర్మానుసారము
పాపపంకిలముకు పరుగుదీయు

కామెంట్‌లు