మినీలు :- @ గోదావరి @ కోరాడ నరసింహా రావు

 తల్లిగోదారి 
.      ******
గోముఖమున పుట్టి.... తల్లి గోదావరి,పరవళ్లుత్రొక్కుచు, 
పచ్చదనము నింపుచు,ఆకలి,
దప్పులుదీర్చుచు...అనుగ్రహమె పన్నీరు,ఆగ్రహమె కన్నీరుగా 
మనల ననుభవింప జేస్తూ.....    సాగరునిలో ఐక్యమై పోవు చుండెను !
     *******
     * పరాయివాడైతేనేమి *
         *****
అడ్డూ - అదుపూ లేని ప్రవాహం 
వృధాఅవుతోంది అమృతజలం పరాయిపాలకుడైతేనేమి.....,
 మహో ప్రకారమే చేసాడు... 
   కాటన్దొర ప్రాతఃరణీయుడు!
     ******
    * అన్నపూర్ణ ఆ సీతమ్మ *
        ******
 ఏ రోజైనా... ఏ వేలైనా.... 
 అతిధుల ఆకలి దీర్చే తల్లి. !
  ఏ జన్మ పుణ్యమో.... 
   ఏ నోము ఫలమో... ఇంతటి 
  భాగ్యమునకునోచుకొంటివమ్మ
  అన్నపూర్ణవై ఈ ఇలలో  చిర కీర్తిని నువ్ పొందావమ్మా... !
 డొక్కా సీతమ్మతల్లీ...మావంద 
 నములు గైకొనుమా... !!
    ******
కామెంట్‌లు