మొగ్గలోనే! అచ్యుతుని రాజ్యశ్రీ

 క్లాసులో పిల్లల అరుపుకి టీచర్ కాసేపు"సిట్ స్టాండ్"అని అంతా నిశబ్దం గా ఉన్నాక ఓ కథ ప్రారంభించింది "చెడు అలవాట్లు పొరపాట్లను మొగ్గలోనే తుంచేసి సరిదిద్దుకోవాలి.అలాచేసేవారిని మొహమాటంతో వదిలేస్తే సంఘ దేశద్రోహులుగా తయారు అవుతారు.ఆరాకుమారుని పేరు నిశ్చల్! తొణకడు బెణకడు.తనవల్ల ఎలాంటి తప్పు పొరపాటు జరగకుండా  చూసుకునేవాడు.పదేళ్ళ పిల్లలు అంతా రాజోద్యానంలో ఆడుకుంటున్నారు. పదేళ్ళ  నిశ్చల్ తరతమభేదాలు చూడకుండా  అందరితో ఆడుతున్నాడు.మిగతా పిల్లలు అంతా సీతాకోకచిలుకలు తూనీగలను పట్టి  దారానికి కట్టి  ఎగరేయటం చూశాడు. అంతే వారిని మందలించాడు."అవి కూడా మనలాంటి ప్రాణులే కదా? మీకాళ్లు చేతులు కట్టి ఎగరమంటే ఎగరలేరుకదా?"అని చెప్తున్నా వినిపించుకోకుండా కొందరు కుందేలు పిల్లలను లేడిపిల్లలను తరుముతూ అవి ఆయాసంతో రొప్పుతుంటే పగలబడి నవ్వసాగారు.
ఇంకోవైపు పిల్లలు చీమల పుట్టని కాలితో తొక్కి చీమల్ని చంపుతున్నారు. కోపంతో నిశ్చల్ అన్నాడు "మీరు హింసాప్రవృత్తిని మానాలి.లేకుంటే రాజుగారికి చెప్తాను "అలాగే కొలనులోని బాతుల్ని కొంగల్ని పిల్లలు విసిగిస్తుంటే రాజభటునితో వారిని తరిమేయించాడు.తేనె తుట్టెల కింద నిప్పు పెడుతున్న వారిని అడ్డుకుని "ప్రకృతిలో ప్రతిదీ అమూల్యమే! ఓవిధంగా మనిషే ఎందుకు కొరగాడు."అని అంటున్న రాకుమారుడితో సేనాని కొడుకు శతపథి అన్నాడు "నిశ్చల్!వీరికి రాజు అంటే భయంతెలీదు.మానాన్నల వల్లనే రాజు పరిపాలిస్తున్నాడు అనే ధీమా ఉంది. " వెంటనే తండ్రి దగ్గరకు వెళ్లి నిశ్చల్ జరిగిన విషయం వివరించి "నాన్నా! నీవు చాలా మెతకవాడివి అనే భావం  పిల్లల్లో ఏర్పడింది.అంటే నీ కింది ఉద్యోగులు నీవు అసమర్ధుడవని ఇంట్లో చెప్తున్నా రని తెలిసిపోతోంది. చెడు ని వెంటనే మొగ్గలోనే తుంచాలి.లేక పోతే మన పాలన ముగుస్తుంది. "రాజు ఇలా అన్నాడు "మీరంతా  పసిప్రాయంలో ఉన్నారు. మనం పాలకులం ఏంచేసినా చెల్లుతుంది అని అధికార దర్పం అహంకారం తో ప్రవర్తిస్తే  జనంలో ద్వేషం  అసహ్యం పెరుగుతుంది. మనపై ప్రజలకి ప్రేమ ఆప్యాయత గౌరవం అభిమానం పెరగాలి. అవసరమైతే కొరడా ఝళిపించాలి.లేకుంటే తిరుగుబాటు తప్పదు.నిశ్చల్ ఆలోచన లో పడ్డాడు. "కథముగించి టీచర్ ఇలా చెప్పింది"మిమ్మల్ని కొట్టి తిట్టి టీచర్ వస్తోంది అంటే భయపడేలా చేయవచ్చు. కానీ మీరు పైక్లాస్ కి వెళ్లాక ఆటీచర్ ని చూస్తూ నే మొహం తిప్పుకు దూరంగా పోతారు.పైగా అమ్మా నాన్న లు టీచర్ పట్ల అమర్యాద గా మాట్లాడటం ఇంట్లో  ఆమెను గూర్చి  కామెంట్స్ చేయటం వల్ల  పిల్లలలో భయం భక్తి తగ్గుతున్నాయి.అలాంటి మాటలు వినవద్దు.ఏమైనా సమస్య ఉంటే వచ్చి టీచర్ తో మాట్లాడమని చెప్పండి!సరేనా?" అంతే ఆరోజు నించి వారిలో ఎంతో మార్పు!వారి మూడ్ ని బట్టి టీచర్ పాఠంతో పాటు బ్రెయిన్ వాష్ చేస్తూ గొప్పవారి జీవిత చరిత్రలు వినిపిస్తోంది  🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం