భాగ్యరేఖ! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు సూర్యుని భార్య అడిగింది "తెల్లారకుండానే లేస్తారు.రాత్రికి గానీ ఇల్లు చేరరు.పగలంతా ఏంచేస్తారు?ఎక్కడ ఉంటారు?"ఆమె ప్రశ్నకి మనసులోనే నవ్వుకుంటూ"నేను లేకుండా రాత్రి పగలు ఉండవు.నాతలపై బోలెడంత భారం!చెట్టు చేమ పశు పక్షులకు ఆహారం అందించే ఏర్పాట్లు చేయాలి. " భార్య పరీక్షించాలనుకుంది.ఒక చీమను తన కుంకంభరిణలో దాచింది.ఆమర్నాడు అడిగింది "ఈరోజు నాకుంకం భరిణలో చీమకు ఆహారం దొరకలేదు."భానుడు అన్నాడు ""నీవు మూతతీసి చూడు!" ఆమె బిత్తరపోయింది. చీమనోటిలో బియ్యం గింజ!"ఉదయం నీవు బొట్టు పెట్టుకునేటప్పుడునీతలపై ఉన్న  అక్షింతలు రెండు  కుంకం భరిణలో పడ్డాయి.ఈరోజు  ఈచీమతో పాటు గోతిలో పడిన  ఏనుగు కూడా  ఆహారం  సమకూర్చాను."భర్త  భానుని మాటలతో సిగ్గుపడింది ఆమె🌷
కామెంట్‌లు