శీర్షిక:బాపు(కందాలు);-సాహితీసింధు సరళగున్నాల
బాపునిన్నేమరువక
చూపులుమీరాకకయ్యి చుక్కలజూడన్
నేపూటైననువీడక
నీపొడనేగాచబోవ నింగేహద్ధౌ


రాజువునువ్వేవంశపు
తేజోగుణసాంద్రతుండు తేజముగులమున్
రాజీదెలియనివాడవు
మాజీవననావకీవె మార్గము బాపూ

ప్రేమను బంచితివెప్పుడు
మామదినింపంగజూచుమాన్యుడవీవే
మీమదిచల్లనివెన్నల
గోముగమాకన్నిబెట్టు గొప్పవుబాపూ

ఏకాదశిపర్వంబున
నేకాకు‌లజేసిమమ్ము నేగితివేలన్
మాకై తపననునొందక
చేకొననాస్వర్గము హరి సేవలుసల్పన్

అప్పాయనుచును బిలుతురు
యెప్పూటైనను మరువరు యిప్పుర ప్రజలున్
యెప్పుడునిన్నేదలుతురు
తప్పకనీవేగబోవ తపనను జెందెన్

తప్పులుజేసిననోపక
మెప్పులకైగాచుకొనక మేలున్జేయన్
అప్పాయని నిను దలుతురు
చెప్పినమార్గంబువీడ,జేయగనెపుడున్

హనుమత్సేవితబంటువు
హనుమంతునిపూజలేక యాకలియైనన్
గనవేవంటలనైనను
గావించినపూజలన్ని ఘడియైనోపవ్

శివపూజాగ్రేసరుడౌ
శివకేశవ నామమిడక సేవించితివే
శివరాతిరిపూజలగని
శివుడేనీభక్తిగోరి జేరగబిలిచెన్

పలుకులు తేనియలొలుకును
ములుకులుగాదెప్పుడైన మోదముబంచున్
అలికిడిగననెచటను నా
నలికిడిజాడేమొదేల్చు నప్పుడెదానిన్

కష్టముగల్గగనెవ రికి
కష్టమెతనదంటుదల్చి గావగజూచున్
యిష్టుడుబంధుజనాళికి
నష్టంబునుజేయకుండు నాయన యితడున్

కపటముజేయుటదెలియదు
ఛపలత్వములేనివాడు శాంతియుతుండున్
తపముగ దాల్చియుపూజల
నపహాస్యముజేయబోడు ననవరతంబున్

జేసెనునెన్నోయాత్రలు
వాసిగపేరొందినట్టి వనసీమలనే
వేసెను శివమతమాలను
భాసిల్లెడు శైవక్షేత్ర  భావనలందన్

నాన్ననుజూడగనవ్వుల్
కన్నీరైనిల్చెనేడుకాలమదేమో
ఎన్నేళ్ళైననుమరువక
నిన్నేనామనమునందునిల్పితినాన్నా

అమ్మనునన్నూతమ్ముల
కమ్మనిప్రేమామృతంబు గలపినహృదితో
చెమ్మనుకంటికిదగలక
నిమ్ముగమముజూచునీకునిచ్చెద నతులన్

బాపూనిన్నేదలుచుచు
నీపూజేనామనంబునిరతముజేతున్
దాపుగనువ్వేవుండిన
మూపుగకష్టంబులైన ముప్పున్జేయవ్

ఎన్ననిజెప్పనుగొప్పలు
ఎన్నగలెస్సౌగుణములవెప్పుడువీడన్
ఉన్నవిజెప్పగదినమౌ
నాన్నే నానాన్నజెప్ప నానందంబౌ

కంచంబున భోజనమును
మంచంబునకన్నిదెచ్చిమన్ననసేయున్
ఇంచైనన్ బాధింపని
కొంచపుగుణమింతలేని గుణవంతుడిలన్

వినయముమీలోమెండుగ
దినదినమునువృధ్ధిజెంది దీవెనలందెన్
మనమున నాటినదదియే
కనిపించెడిదైవమయ్యి గాచునుమమ్మే

మోమున ముసిముసినవ్వులు
గోముగమాటాడుమాట గుర్తే నాన్నా
ధీమేమీరై,ముందుకు
నామానసమందునిల్చి,నడుతును నాన్నా

అధికముగప్రేమనిచ్చుచు
మధురిమలనుబంచునట్టి మమతలరేడున్
అధరముపైచిరునగవున
విధిలించగజూడనట్టి విజ్ఞుడెనాన్నా

వదలని పెనునిద్దురలన్
వదిలించెడిమంత్రమేసి వదలకలేపున్
అదిరించినబెదిరించక
మదినందునమురిసిపోయె మహితుడునాన్నా

కమ్మనికథలనుజెప్పుచు
యిమ్ముగతనగుండెపైననింపారంగన్
గమ్మునబజ్జోబెట్టుచు
యిమ్ముగతాముద్దులెన్నొ యిచ్చెను నాన్నా

ఎన్నగనెన్నోబుధ్ధులు
మన్ననజేపించజూచు మహిలోనెపుడున్
దన్నుగమీకైనిలుచుచు
వెన్నుడునేవేళనైన విజయమునిచ్చున్

కంటికిరెప్పగగాచును
ఇంటికితాపెద్దదిక్కు యెప్పటికైనన్
మింటికిజేరెనుతొందర
కంటికినీరైనిలిచెను కలకాలంబున్

పట్టినపట్టునువీడక
పుట్టినయూరినపనులను పూరించెనుగా
వెట్టినజేసెడివారల
నట్టేటనుమున్గకుండ నడిపెను నాన్నా

సరియగు నగలనుగొనుటలొ
మరితెలివిని గని మెదిలెను మనిషిగ నెపుడున్
మురిపెము గలిగెను హృదికిని
సరియగునిపుణత గలియుగు సతతము నడిపెన్

వరదుడు సాధుజనాళికి
కరములవీడకతపమును గావించెనుగా
తరములదాటినభక్తిని
మరువక,నీపాదసేవ మానకజేసెన్

అనయము పెద్దలయందును
కనికరమునుజూపుచుండు  ఘనుడైనిలిచీ
ధనమునునీయగనెపుడును
తనవారుగనాదరించు తండ్రేనితడున్

పాపపుఫలితము విడువడ
నీపైనన్జూపనేగు నెప్పుడునైనన్
కాపాడగపుణ్యఫలము
శాపాలనుదొలగజేయు శాంతినిగూర్పన్

రూపము నందమునిండిన
చూపకయేగర్వములను ,శూశ్రుతజేయున్
కాపాడగదీనజనుల
నేపూటైనన్గడుపుకు నింతయు బెట్టున్

కామెంట్‌లు