మహామనీషి..సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
 తంజావూరు లోని కోమల్ అనే పల్లె లో పుట్టిన శ్రీ వైద్యనాధ అయ్యర్ కర్నూలు లో తన సొంతభూమిలో మహిళా కళా శాలకి విరాళం ఇచ్చిన సంగతి మనకు తెలీదు. బాల్యం లోనే  తండ్రిని కోల్పోయిన ఈయన వీధిధీపాలకింద చదువుకున్నారు.ఈయన క్లాస్మేట్స్ శ్రీవి.వి.గిరి శ్రీ నీలం సంజీవరెడ్డి గార్లు.ఆయన ఫీజులు అన్నీ ట్రావెన్కోర్ దివాన్ కట్టేలా ఏర్పాటు చేసినవారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు! దివాన్ కొడుక్కి అయ్యర్ చదువు చెప్పేవారు. మద్రాసులోని ప్రెసిడెన్సీకాలేజ్ లో ఎం.ఎ.ఆనర్సు ఉన్నతశ్రేణిలో పాసైనారు.పూణేలో క్లర్కుగా  చేసి ఆపై కర్నూలులో మున్సిపల్ హైస్కూల్ మాష్టారు గా స్థిరపడ్డారు.గాంధీ శాస్త్రిజీ పటేల్ తో కలిసి ఖాదీప్రచారం చేశారు. 16మంది పిల్లలున్న సంసారి.అందులో 11మంది మిగిలారు. అందరికీ ఏడాదికి రెండు జతల దుస్తులు ఒకే తానులో కుట్టించేవారు.ఆడ మగ పిల్లల దుస్తులు యూనిఫాం లా ఉండేవి. వాటిపైన భార్య దారంతో పేర్లు కుట్టేది.65వ ఏటకూడా సైకిల్ నే వాడారు. ఆయన పెట్టిన  ఖాదీషాపులో కాంగ్రెస్ పార్టీ మీటింగులకి గాంధీజీతో  సహా హాజరయ్యారు. సొంతంగా  చరిత్ర పుస్తకాలు రాశారు. బీదపిల్లలకి తన ఇంట్లో భోజనం ఫ్రీగా చదువు చెప్పేవారు. ఆనాడే కోఎడ్యుకేషన్ చదువు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇది గిట్టని ఓవ్యక్తి నడిరోడ్డుపై ఈయన చెంపలు వాయించి దుర్భాషలాడాడు.ఆతనిపై కేసుపెట్టమని అంతా చెప్పినా క్షమించిన దొడ్డబుద్ధి !సొంత ఇంటి నిర్మాణం లో ముస్లిం మేస్త్రీకి సాయంగా ఈయన కన్నపిల్లలు ఇసుక  సిమెంటు మొదలైనవి మోశారు.మరి సంసారం గడవటంకోసం అద్దెకు ఇళ్ళు కట్టారు. ఆయన కి  పల్లె జనం పళ్ళు కూరలు పంపేవారు.తన 8మంది కూతుళ్ళకు రోజూ  ఇదేచెప్పేవారు"మీకాళ్లపై మీరు నిలబడాలి.మీభర్తలకు ఏదైనా జరిగితే పుట్టింటికి పరుగెత్తరాదు.అన్న దమ్ములపై ఆధారపడరాదు."తోటపని చేస్తూ పిల్లల చేత చేయించి ఇంటికి కావల్సినవన్నీ పండించేవారు.బిచ్చగాళ్ల ను ఇంటివరండాలో వర్షం పడినప్పుడు ఆశ్రయమిచ్చి కడుపు నింపేవారు.1972లో పక్షవాతం తో తుదిశ్వాస విడిచాడు. 
ఇక ఈయన భార్య కుంజమ్మాళ్ మూడుపూటలా కట్టెల పొయ్యి పై వంటలు రకరకాల స్వీట్లు హాట్ల తో పిల్లలతో సమంగా పండగరోజుల్లోపనిలో తోడ్పడేవారికి పంచేది.అంటరాని తనం లేకుండా  ఎవరు ఎన్ని మాటలన్నాఓముసలామెని ఆదరించింది.9గజాలఖాదీ చీరెలో నవ్వుతూ పిల్లలకి కథలు కబుర్లు చెప్పి స్వయంగా వారికి  అన్ని పనుల్లో సాయంచేసేది.ఎవరి బట్టలు వారు ఉతుక్కునేలా నేర్పింది. అంతా నేలపైనే పడుకునేవారు.భగవద్గీత రామాయణం చదువుతూ సంగీతంపాడేది.భర్త పోయిన కొద్ది రోజులకే తుదిశ్వాస విడిచింది.
ఈ దంపతులగూర్చి చదివాక  నాలో ఎన్నో  ఆలోచనలు! ఇన్ని ఆధునిక సౌకర్యాలు  ఒకరు లేక  ఇద్దరు పిల్లలున్న మనం టెన్షన్ బతుకు కృత్రిమ లోకంలో  జీవిస్తున్నామా?! ఆదంపతులు ఎంతో మంది గొప్ప వారితో పరిచయంఉన్నా  రికమండేషన్ కోసం ప్రయత్నించలేదు.తృప్తి!ఇంకా ఆశ్చర్యం ఏమంటే  ఆతల్లి  తలుపు చాటునించే భర్తతో మాట్లాడేది.దైవం  వారి సంతానంకి అన్నీ ఇవ్వడం వారు  జీవితంలో స్థిరపడడం వారి పుణ్య కార్యాలే కారణం అనిపించింది.🌹

కామెంట్‌లు