ఏ కుటుంబమైన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో, అక్కాచెల్లెళ్ల తో హాయిగా సంసారం సాగుతోంది. ఆనందమయమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఒక్కొక్కడు చదివి పెద్దవాడై ఉద్యోగం చేసుకుంటూ వివాహ ప్రయత్నాలు చేసి కుటుంబ సభ్యులందరికీ నచ్చిన వారిని ఎన్నిక చేసి పెళ్లి చేస్తారు. పరిస్థితుల ప్రభావం వల్ల గానీ, కొత్తగా వచ్చిన ఆ స్త్రీ వీరిలో ఇమడ లేకపోవటం కానీ జరిగినప్పుడు కలహాలు ప్రారంభమవుతాయి. తాను ఎలాంటివాడైనా భార్య మీద మాట పడనివ్వడు కదా ఆవిడ తరుపున మాట్లాడడమే ధర్మంగా భావిస్తాడు. దానితో పట్టుదలలు ప్రారంభమవుతాయి. కని, పెంచి ఇంతవాడిని చేసిన నా మాట మీద గౌరవం లేదా వీడికి అని తల్లి బాధపడుతూ ఉంటుంది. వేలు పట్టుకుని నడిపించి అనేక విషయాలు తెలియజేసి వాడి చదువు కోసం కష్టపడ్డాను నన్ను లెక్క చేయడం లేదని తండ్రి బాధపడతాడు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు కూడా ఎంతగా కలిసి ఒక కంచంలో తిని, ఒక మంచంలో పడుకున్న మనమధ్య భేదాభిప్రాయాలు కలగజేసిన ఆమెకు వత్తాసు పలుకుతున్నాడు అంటే అందరికీ మనసులో కష్టంగానే ఉంటుంది. మాట పట్టింపుల వల్ల విడిపోయి వేరే కాపురం పెట్టక తప్పదు అప్పుడు అసలు కష్టాలు ప్రారంభమవుతాయి. వారు ఇద్దరే ఉంటారు ఎలాంటి ఆప్యాయతలు, అనురాగాలు ఉండవు ప్రతిదీ సమస్యగానే ఉంటుంది. తోబుట్టువులు జ్ఞాపకం వస్తూ ఉంటారు. అప్పుడు అనుకుంటాడు తను ఎంత వెర్రి పని చేశాను అని. దానిని వేమన ఎంత అందంగా చెప్పాడంటే. గోదావరి ఈదడానికి కుక్కతోక పట్టుకుంటే అది ఆ చివరి వరకు తీసుకెళుతుందా మధ్యలోనే ముంచుతోంది. భార్యను నమ్ముకుని వేరే వస్తే అలా ఉంటుంది అని. అయిన వారికి దూరంకావద్దు అంటూ గొప్ప నీతిని మనకు చెప్పాడు వేమన.
కుక్క తోక వంకర;-ఏ. బి ఆనంద్,ఆకాశవాణి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి