కలం బలం ;-- యం. వి. ఉమాదేవి
కవికి మనోరంజితం కలం,కాగితము 
భావనల బహిర్గతం భవ్యచేతనమార్గము !

ఊహలకి అందని  చరిత్ర లిఖితo 
అక్షర సత్యాల అద్భుతరూపం !

ముఖ్యవిషయాలకి సాక్షి సంతకాలు 
కలం కాగితం ఎన్నో నిదర్శనములు !

కవితా స్ఫూర్తి కి
ఆధారాలు 
సాహితీ మూర్తులకి తరగని నిధులు !

సొంత ఆలోచనల అక్షర రూపాలు 
కలంతో జనంపై చెరగని ముద్రలు !!
కామెంట్‌లు