:మా బడి;-సి.హేమలత-పుంగనూరు
పలక,పడవ,పనస అంటూ
అక్షరాలను పరిచయం చేయును
పదాలతో పాటలతో
అలరించు మా బడి

పాటలతో,ఆటలతో ఆలోచన పెంచును
ప్రజ్ఞా,పాటవాలను పద్ధతిగా నేర్పును
పచ్చని తరువులే ప్రగతికి మెట్లని
పిల్లాపాపలతో చెట్లను నాటిన
పుడమిన పుత్తడి పండునని మాత
పితలకు ఉద్బోద చేసే మా బడి

ప్రపంచీకరణ

లో ముందుకెళ్ళాలంటే
పెంపోందాల్సింది నాగరికత కాదు
పైరు పంటలతో సాగును
ప్రాణాంతకమైన ప్లాస్టిక్ తరిమివేతలో అని మార్గం చూపె

పౌరులతో భారతావని పచ్చగా శోభిల్లాలంటే
పచ్చలహారంలా చెట్లు పుడమి తల్లిమెడన అలంకరించాలని
ప్రేమారగా ప్రకృతి ని చేరదీస్తే 
శత వసంతాల నవకాంతి 
మానవునిదని తెల్పె మా చదువుల గుడి

కామెంట్‌లు