మోసం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆపాలమ్మి తన దగ్గర ఉన్న ఆవు గేదెల పాలు అమ్మేది.పదిహేను రోజులకోసారి నెయ్యి అమ్మేది.కాంతం అనే పొరుగున ఉండే ఆమెకు కనీసం 50రూపాయల విలువైన  నెయ్యిని ఫ్రీగా ఇచ్చేది.కాంతం తన పెరట్లో కాసే కూరలు ఓకట్ట ఆకుకూర  గుప్పెడు కనకాంబరాలు చేమంతి బంతి ఇచ్చేది. ఒక్కోసారి  దూరం దూరంగా మల్లె జాజి ఓజానెడు దండ లచ్చవ్వ కిస్తే ఆమె దాన్ని  దేవుని గుడిలో ఇచ్చేది.కాంతం  మహాఇస్తే 20రూపాయల ఖరీదువి ఇచ్చేది. పశుపోషణ వాటి ఆలనా పాలనా చూస్తూ  ఫ్రీగా ఆరోజు  టీచర్ కి తెచ్చి ఇచ్చింది "అమ్మా! నాబిడ్డకి ఫ్రీగా చదువు చెప్తున్నావు.నీకాడ నెయ్యి కి పైసలు తీసుకోను".టీచర్ వివరాలు కనుక్కుని అంది" చూడు లచ్చవ్వా! కాంతం నీ ఖరీదైన నెయ్యికి కేవలం కంటితుడుపుగా కూరలు పూలతో సరిపెడ్తోంది.నీవు వాటిని దేవుని గుడిలో ఇస్తావు.గుడిలో అన్నదానంకి కూరలు ఇస్తావు.కాంతం నిన్ను మోసం చేస్తోంది. నీవు నెలకి 100రూపాయల ఖరీదు నెయ్యి ఇస్తే  ఆమె నీకు కేవలం  20రూపాయల ఖరీదు చేయనివి ఇస్తోంది. "టీచర్ మాటలు విన్న లచ్చవ్వ ఇలా అంది"పోనీలే అమ్మా!పైన దేవుడుండాడు".ఆరోజు  కాంతం తోటలో  బురదలో జర్రున జారి కాలు విరగటంతో తగిన శాస్తి జరిగింది అని టీచర్ మనసు లో  సంతోషిస్తే లచ్చవ్వ పాపం  అనుకుంది🌹
కామెంట్‌లు