సుప్రభాత కవిత ; బృంద
ఆశ నిరాశల ఊగిసలాటలో
చీకటి వెలుగుల చెలగాటంలో

తప్పని కాలగమనం
ఆగని జీవన పయనం

శిశిరంలొ  చెట్టు ....బెంగపడక
వసంతమొస్తుందిగా అని నమ్మినట్టు

కరిగిపోయిన క్షణం  
మరలా తిరిగి రాదు
రాబోయే నిమిషం 
కలత తీరే సమయం

అనుకునే నమ్మకమే 
జీవన చక్రానికి ఇంధనం.

అనుకూల అలోచనలతో
నిరంతరం  చైతన్యాన్ని 
ఆహార్యంగా మలచుకుంటే

ఋతువులెన్ని మారినా
వసంతాల పరిమళమే!

ప్రతి ఉదయం  ఉత్సాహమే!
ప్రతి ఆలోచనా ప్రచోదనమే!

ఉత్తేజితం  చేసే ఉదయకిరణాలను
ఆనందంగా అలింగనం చేసుకుంటూ

🌺🌺  సుప్రభాతం 🌺🌺


కామెంట్‌లు