అదొక రహదారి. అయినా వాహనాల రాకపోకలు అంతగా లేవు. రాత్రి సమయం. రెండు కర్లు ఎదురెదురు వస్తున్నాయి. అనుకోకుండా అవి డీకొన్నాయి.
ఓ కారు నడుపుకుంటూ వచ్చిన మనిషి వకీలు. మరొక కారు నడుపుకుంటూ వచ్చిన వ్యక్తి వైద్యుడు. అయితే అదృష్టవశాత్తు ఇద్దరికీ గాయాలవలేదు. కార్ల ముందర భాగాలు కాస్తంత దెబ్బతిన్నాయి. కార్లాగిన కాస్సేపు తర్వాత ఇద్దరూ తమ తమ కార్లలోంచి కిందకు దిగారు.
వకీలు చెప్పారు – “కంగారుపడకండి, కంగారుపడటానికేమీ లేదు”
“అయినప్పటికీ నాకిది అనుకోని ఆందోళన” అన్నారు డాక్టరు కంగారుపడుతూ.
వెంటనే వకీలు తన కారులోకి వెళ్ళి ఓ ప్లాస్కు తీసుకొచ్చి ఓ గ్లాసులో కాఫీ పోసిచ్చి ఇది తాగండి... అంటూ డాక్టరుకిచ్చారు. కంగారుపడకండి...భయపడటానికేమీ లేదు అన్నారు.
“థాంక్సండీ...” అని వైద్యుడు ఆ గ్లాసు అందుకుని తాగారు.
ఆ తర్వాత వకీలుని చూసి “మీరు కంగారుపడుతున్నట్టున్నారు...అవును కందడీ...” అన్నారు వైద్యుడు.
“నిజమే...” అన్నారు వకీలు.
“అలాగైతే మీరు కాస్త కాఫీ తాగి ఉండవచ్చుగా” అన్నారు వకీలుతో వైద్యుడు.
“అవును తాగుతాను. కానీ ఇప్పుడు కాదు” అన్నారు వకీలు.
“మరెప్పుడూ...”
వకీలు చెప్పారు ...
“ఇంకాస్సేపటికి పోలీసులు వచ్చి ప్రశ్నిస్తారు కదండీ. ఆ తర్వాత కంగారుపడతాను…”
మిత్రులారా, జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనలో చాలా మందిమి కంగారుపడిపోయి తెరచాటుకు వెళ్ళిపోతాం. మన వేషాలూ మన ప్రవర్తనా బయటపడతాయి.
ఓ జ్ఞాని చెప్పారు...
నన్ను కలవడానికి వస్తున్నవారందరూ నేను డాక్టరుని, నేను వకీలుని, నేను పారిశ్రామికవేత్తను. నేను రాజకీయవాదిని ఇలా తమను పరిచయం చేసుకుంటుంటారు. దీంతో నేను కలవరపడతాను అని.
ఇందులో కలవరపడటానికి ఏముంది అంటారా....
అందరూ తమ తమ వృత్తులను చెప్పుకుని పరిచయం చేసుకుంటున్నారే తప్ప ఎవరూ తాను ఓ మనిషి అని పరిచయం చేసుకోవడం లేదన్నదే నా దిగులంతా అన్నారు జ్ఞాని.
కలవరం;-- యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి