ఆచరణలో!అచ్యుతుని రాజ్యశ్రీ

 "అయ్యో!ఈ ఆటవికులు నన్ను బలి ఇవ్వబోతున్నారు.నన్ను కాపాడండి "హృదయ విదారకంగా దీనాలాపన చేస్తున్నాడు ఆపదేళ్ల కుర్రాడు. దండయాత్ర కి బైలుదేరిన పశుపతి నాధ్ మహా రాజు కిఆవిలాపాలతో  మనసు భావాలు చెదరసాగాయి.అతనిది జాలిగుండె! రాజ్యోచిత కార్యాల్లో మహాకఠినుడు.కానీ వ్యక్తిగా భూతదయ జాలిగుండె కలవాడు.శరణన్నవారిని అక్కున చేర్చుకుంటాడు.తన పర జాతి కుల భేదం లేకుండా అందరికీ ఆత్మీయత పంచే రాజు తటాలున కత్తి చేతబూని నమ్మిన బంటు మతంగునితో బైలుదేరాడు. బౌద్ధమతం విస్తరి స్తున్న కాలం అది!యజ్ఞాలు యాగాలలో జంతుబలి ఉండరాదని శాసించాడు.బౌద్ధవిహారాలు కట్టించాడు.అదృష్టవశాత్తు  ఈమారుమూల ప్రాంతంలో అక్రమాలు అన్యాయాలు బైట పడటం రాజు కి ఆనందం తో పాటు ఆందోళన కూడా కల్గిస్తోంది.మతంగునితో కలిసి రాజు ఆఏడ్పు వస్తున్న దిశగా సాగాడు.కాళికాలయం కన్పడింది.కాగడాలవెలుగులో  చెట్టుకి కట్టేసిన ఆఅనాధ బాలుడు గుండె లవిసేలా రోదిస్తున్నాడు.ఆటవిక నాయకుడు  కత్తిని బాగా నూరుతున్నాడు.వాడిపక్కన ఓమొరటోడు
పసుపు కుంకం సాంబ్రాణి  అన్నీ సిద్ధం చేస్తున్నాడు.రాజు తో పాటు మతంగుడు తటాలున వారిపై దాడిచేశారు.నాయకుడి చేతిలోని  కత్తి  ఎగిరి ఆమూల పడింది. వాడితో పాటు అనుచరుడిని బంధించి రాజు హుంకరించాడు"ఏంరా?ఓపసివాడిని బలి ఇవ్వబోతున్నావా?"వాడు గడగడా వణుకుతూ అన్నాడు "సామీ!ఆపిలగాడు అనాధ!కోతులు ఉడతలతో ఆడుతాడు.వీడికోసం ఏడ్చెటోల్లు ఎవరూలేరు.నాభార్య సచ్చిపోయింది.నాకొడుకు పానాలమీదకి వచ్చింది. ఆడిఒంటినిండా పొక్కులు!ఒల్లంతా భగభగమంటలు! ఆడికోసం ఈపిలగాడ్ని బలిఇవ్వమని మాకోయదొర చెప్పిండు."అంతే రాజు కోపంతో వీరావేశంతో రంకెలేయసాగాడు"ఇప్పుడు నిన్ను చంపుతా!నీకొడుకు కూడా  దిక్కు లేని అనాధ అవుతాడు. నారాజ్య క్షేమంకోసం నీకొడుకుని బలిఇస్తాను.ఈఅడవిలో రకరకాల పురుగులు కీటకాలు దోమలవల్ల అంటువ్యాధులు రావటం సహజం!నేను మావైద్యుల్ని  పంపి మీరోగాలకి మందులు ఇప్పిస్తాను.మూలికావైద్యం కూడా చేస్తారు వారు" అని వారికి నచ్చజెప్పి బందీగా ఉన్న పిల్లాడిని తనతో తీసుకుని పోయాడు. ఆగూడెంలో వ్యాపించిన అంటు చర్మ రోగాలు (స్మాల్పాక్స్ ఆటలమ్మ జాండీస్ మొదలైన రోగాలు) వైద్యుల వల్ల తగ్గటంతో ఆ ఆటవికులకు రాజు పై భక్తి విశ్వాసాలు పెరిగాయి. జంతు బలి కూడా మానేశారు.సరిహద్దుల్లో కాపలా దారులుగా మారారు.రాజు వెంటనే స్పందించటంతో తనుఅనుకున్నది ఆచరణలో పెట్టడంతో దేశం సుభిక్షంతో కలకలలాడింది🌷
కామెంట్‌లు