మహానుభావులు; : సి.హెచ్.ప్రతాప్
 తమిళనాడులో  తిరువల్లువర్ అనే సాధువు ఉండేవాడు. తండ్రి  వృద్ధ్యాప్యంలో పడ్దాక తిరువల్లువర్ వంశ పారంపర్యంగా వచ్చిన చేనేత వృత్తి స్వీకరించాడు.. రోజుకు ఒక్క చీర నేస్తూ బజారులో అమ్మి కుటుంబానికి డబ్బు సంపాదించే వాడు. అదే ఊరిలో ఒక ధనవంతుని కొడుకు ఉండేవాడు. డబ్బు ఉన్న చోట అహం ఉంటుంది. అహంకారం వల్ల అనేక చెడు గుణాలు పుట్టుకొస్తాయి. ఆ ధనవంతుని కొడుకు డబ్బు వలన వచ్చిన మదంతో స్నేహితులతో జల్సాగా తిరుగుతూ చెడు సాంగత్యంలో పడ్డాడు.  ఒకరోజు ధనవంతుని కొడుకు తిరువళ్లువర్ వద్దకు వచ్చి చీర ధర అడిగాడు.
నాలుగు రూపాయలు ఖర్చవుతుందని తిరువల్లువర్ చెప్పారు. ధనవంతుని కొడుకు  చీర తీసుకుని రెండు ముక్కలు చేసి ఒక్క ముక్క ధర అడిగాడు. తిరువళ్లువర్ సమాధానమిస్తూ, చీరను రెండు భాగాలుగా చేసినందుకు రెండు రూపాయలు ఖర్చవుతుంది. ధనవంతుని కొడుకు  దానిని మళ్ళీ మరొక ముక్కగా చించి ధర అడిగాడు. ధర ఒక్క రూపాయి అని తిరువల్లువర్ సమాధానమిచ్చారు. తిరువళ్ళూరును ఏడిపించి, అతనిలో ఆవేశకావేశాలు పెంచాలని అతగాడు వంకర టింకర గా నవ్వుతూ, తిరువళ్ళూరును అసభ్య పదజాలంతో దూషంచసాగాడు. అయినా తిరువళ్ళూరు ఏమాత్రం తొణకక, బెణకక, ముఖంపై చిరునవ్వును చెదరనీయక ఆ ధనవంతుడి కొడుకు చర్యలను, మరియు అసభ్య పద కాలంతో దూషణను భరిస్తూ నిబ్బరంగా తన స్థానంలో కూర్చున్నాడు. దీంతో బాలుడి మనసులో మార్పు వచ్చింది. చీరను ముక్కలు చేసిన తర్వాత కూడా ఆ వ్యాపారవేత్త ప్రశాంతంగా ఎలా కూర్చున్నాడో అని ఆశ్చర్యపోయాడు.
అప్పుడు ధనవంతుని కొడుకు  తిరువల్లువర్ పాదాలపై పడి అతని ప్రవర్తనకు పశ్చాత్తాప పడ్డాడు. తన గర్వం, అహంకారం వల్లే ఈ తప్పు చేశానని చెప్పాడు. అప్పుడు అతను తన తండ్రి వద్దకు వెళ్లి, అవసరమైన డబ్బు తెచ్చుకున్నాడు, తిరువళ్లువర్ పాదాల వద్ద ఉంచాడు.
 తిరువళ్ళూరు స్థానంలో ఏ సాధారణ మానవుడు వున్నా అతని ప్రవర్తన భిన్నంగా వుండేది. చీర చింపినందుకు, అసభ్య పదజాలంతో దూషించినందుకు అవతలి వారిపై పడి వారిని కొట్టడమో, తిట్టడమో చేసేవారు. కానీ స్వతాహాగా సాధు స్వభావం కలిగిన తిరువళ్ళూౠ అందరిలో దైవత్వాన్ని చూడగలిగిన మహానుభావుడు. భగవంతుని కరుణ అపారంగా పొందినవాడు. అందుకే జీర్ణించుకోలేని అభ్యంతరకర ప్రవర్తనను ఆ ధనవంతుని కొడుకు కనబరచినా  ఎంతో శాంతంగా వుండడమే కాకుండా  తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడి శరణు జొచ్చిన ఆ ధనవంతుడిని కొడుకును మనస్పూర్తిగా క్షమించగలిగాడు. ఇలాంటి ఎందరో మహానుభావులు మన దేశంలో జీవించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రజలు, ధార్మిక వేత్తలు వారి విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు. వారి విగ్రహాలు కాదు, వారి బోధనలే ముఖ్యం. వారి బోధనలను ప్రచారం చేయడానికి ఉత్తమ మార్గం వాటిని ఆచరించడం. అందుకే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు



సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు