విస్సన్న వేదం-(అప్పటి ఇప్పటి పెళ్ళిల్లు);-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అప్పుడు అంటే
అనగనగా అనే
అమ్మానాన్నలు పెళ్ళిచేసుకున్న
ఆ రోజులు

మరి ఇప్పుడంటే
మనుమల్లు మనుమరాల్లు
మనువు ఈడుకొచ్చి
మసలుతున్న ఈరోజులు

ఒకప్పుడు
పెళ్ళిల్లుకాక
ఆడపిల్లలు
శాశ్వతకుమారీలుగా మిగిలిపోయేవారు

ఇప్పుడు
పెళ్ళిల్లుకాక
మగపిల్లలు
ముదిరిన బెండకాయలవుతున్నారు

ఒకప్పుడు
మొలతాడుంటే చాలు
మగపిల్లలకు
పెళ్ళిల్లు జరిగేవి

మరిప్పుడు ఆస్తులున్నా 
ఉద్యాగాలున్నా అందంగానున్నా
మగవాళ్ళకు
పెళ్ళిల్లు సులభంగా జరగటంలేదు

అప్పుడు ఆడపిల్లలు
పెళ్ళిచూపులంటే
తలవంచుకునేవారు
సిగ్గుపడేవారు

ఇప్పుడు పెళ్ళంటే
మగపిల్లలు
మొహమాటపడుతున్నారు
అడుగులు వెనుకకేస్తున్నారు

అప్పుడు
ప్రతి ఊరిలో
పెళ్ళిల్లపేరయ్యలు ఉండేవారు
పెద్దలతో మాట్లాడి పెళ్ళిల్లుచేసేవారు

ఇప్పుడు 
చదువుకునేరోజులలో చనువులు
ఉద్యోగంచేసేరోజులలో ప్రేమలు
పెళ్ళిసంబంధసంస్థల ప్రమేయపెళ్ళిల్లు జరుగుతున్నాయి

ఒకప్పుడు
జాతకాలు 
కుదిరితేనే
పెళ్ళిల్లు జరిగేవి

ఇప్పుడు
జాతకాలు
పట్టించుకోకుండానే
పెళ్ళిల్లు జరుగుతున్నాయి

ఒకప్పుడు
బంధువులతోనే
ఈడుజోడు చూచి
పెళ్ళిల్లు చేసేవారు

ఇప్పుడు
మేనరికాలు
చుట్టాలు మధ్య
పెళ్ళిల్లు చేయటంలేదు

ఒకప్పుడు
ఒకే కులస్తులమధ్యనే
ఒకే మతస్తులమధ్యనే
పెళ్ళిల్లు జరిగేవి

ఇప్పుడు
కులాంతర
మతాంతర
పెళ్ళిల్లు పెరిగిపోయాయి

ఒకప్పుడు
సొంతవూరివారిమధ్యనో
దగ్గరవూరివారిమధ్యనో
పెళ్ళిల్లు జరిగేవి

ఇప్పుడు
చాలా దూరంవారయినా
ప్రక్కరాష్ట్రాల వారయినా
పెళ్ళి చేసుకుంటున్నారు

ఒకప్పుడు
వరకట్నం ఇస్తేనే
మగపెళ్ళివారు
పెళ్ళిల్లు చేసుకునేవారు

ఇప్పుడు
ఆడపిల్లల తల్లుదండ్రులు
ఎదురుకట్నం ఇస్తేనే
పిల్లలనివ్వటానికి ఒప్పుకుంటున్నారు

ఒకప్పుడు
ఉద్యోగంచేసే
ఆడపిల్లలను
పెళ్ళిచేసుకొనేవారుకాదు

ఇప్పుడు
మగపిల్లలు
ఉద్యోగంచేసేవారినే
పెళ్ళిచేసుకుంటామంటున్నారు

ఒకప్పుడు
వరుడుకంటే 
వధువువయసు
 చాలా తక్కువ ఉండేది

ఇప్పుడు
ఎక్కువుగా
సమవయస్కులమధ్యనే
వివాహాలు జరుగుతున్నాయి

ఒకప్పుడు
మగవారు
రెండుమూడు 
పెళ్ళిల్లు చేసుకొనేవారు

ఇప్పుడు
ఆడవారు సహితం
రెండుమూడు
పెళ్ళిల్లు చేసుకుంటున్నారు

అప్పుడు
పెళ్ళిల్లు
కాపురాలు
బంధాలు స్థిరంగా ఉండేవి

ఇప్పుడు
వేరుపడటాలు
విడాకులు
విరివిగా జరుగుతున్నాయి

ఒకప్పుడు
నేను చెప్పినట్లు
మా ఆవిడ
వినేది

ఇప్పుడు
మా ఆవిడచెప్పినట్లు
నేను
వింటున్నాను

బ్రహ్మం గారి
కాలఙ్ఞానం చూస్తున్నాము
వేమన గారి
సూక్తులు వింటున్నాము

మనువాదం
మట్టిలో కలిసింది
విస్సన్న వేదం
అమలులోకి వచ్చింది

===================

ఈ కవిత
విస్తారం
ఈ కాలానికి
ప్రతిబింబం

విరామం ఇవ్వకుండా
విసుగు చెందగుండా
విడిచి పెట్టకుండా
ఓర్పుతో చదవండి

కామెంట్‌లు