మినీలు ; -- జయా
అమ్మ
జ్ఞాపకానికి వస్తున్నప్పుడల్లా
నిన్ను మరచిపోతున్నా

నిన్ను 
చూసినప్పుడల్లా
అమ్మ గుర్తుకొస్తూనే ఉంటుంది
===================
తినడం
తెలీని చిన్నారి
విందులో
అన్నీ కలిపి
నోట్లోపెట్టుకున్నట్టే
ఉంటుంది 
అప్పుడప్పుడు 
జీవితంలో...
===================
మాటల్ని
సరిగ్గా ఎంపిక చేయకుంటే
మనకిష్టమైన బంధాన్ని
కోల్పోవలసి ఉంటుంది
==================
జ్ఞాపకాలను
వెంటేసుకునే వస్తాయి
మనసుకిష్టమైన
పాటలు వింటుంటే
====================
రాత్రంతా
జ్ఞాపకాల వర్షంతో
పరవశించిన మనసు
ఉదయం
సూర్యోదయ స్పర్శతో
పులకించి తరించింది
=================


కామెంట్‌లు