సునంద భాషితం ;-వురిమళ్ల సునంద ఖమ్మం
  మాటా... మౌనం...
   ****
మాటా, మౌనం రెండూ మనిషికి ఉన్న గొప్ప ఆయుధాలు.
వాటిని సరిగా ఉపయోగించే చాతుర్యం మనలో ఉండాలి.
వాటితో కొన్ని పొందనూ వచ్చు. సరిగా ఉపయోగించక పోతే  కోల్పోనూ వచ్చు.
మాట అన్ని వేళలా రాణించదు.అనవసరమైనచోట మాట్లాడే మాటకు విలువ లేకపోవడమే కాదు, మాటకు మాట పెరిగి చిలికి చిలికి గాలి వానలా వివాదం పెరగడం చూస్తూ ఉంటాం.
అలాంటి సమయంలో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మేలని అర్దం అవుతుంది.
మాట అవసరం లేని సమయంలో మౌనం దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
ఎన్నో సమస్యల్ని సునాయాసంగా దూరం చేస్తుంది.
కయ్యానికి కాలు దువ్వే వారి దగ్గర మౌనం మహా శక్తివంతమైన ఆయుధమై ఎదుటి వారి దురాలోచనలను తిప్పి కొట్టి,వాళ్ళను పునరాలోచనలో పడేలా చేస్తుంది.
 కాబట్టి ఎక్కడ మాట అవసరమో అక్కడ మాట్లాడుతూ, అవసరం లేని చోట మౌనంగా ఉందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏కామెంట్‌లు